తొలిసారి ఓటేసిన అవిభక్త కవలలు

conjoined-sisters-saba-farah-cast-their-votes-individually-first-time

సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్ ఇవాళ కొనసాగింది. రాజకీయ నాయకులు, ప్రముఖులతో పాటు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

బీహార్ రాష్ట్రంలోని పట్నాకి చెందిన అవిభక్త కవలలు సభా, ఫరా కూడా ఓటేశారు. అవిభక్తులైన వారిద్దరూ ఓటేయడం ఇదే మొదటిసారి. వీరిద్దరూ పూర్తిగా విడిపోకుండా కలిసే ఉన్నప్పటికీ.. వారికి ఎన్నికల కమిషన్ వ్యక్తిగతంగా రెండు ఓట్లు వేర్వేరుగా కేటాయించింది. వారికి నిర్దేశించిన పోలింగ్ బూత్ లో విడివిడిగా ఇద్దరూ ఓటేసినట్టు ఈసీ తెలిపింది.

పోలింగ్ స్ఫూర్తి చాటిన వారెందరో..

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ గ్రీన్ ఫీల్డ్ స్కూల్ లో అంధులు, కంటి చూపు సరిగా లేనివారు తమ ఓటు హక్కును ఉపయోగించారు.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు.. తమ కుటుంబసభ్యులతో పోలింగ్ బూత్ కు వచ్చి ఓటేశారు.

వెస్ట్ బెంగాల్ లోని డుమ్ డుమ్ లో.. ఓ వ్యక్తి.. తన తల్లిని తన చేతులతో మోసుకుంటూ 242 పోలింగ్ బూత్ కు తీసుకెళ్లాడు.

వికలాంగులు, ప్రత్యేక వైకల్యం ఉన్నవారు, వయోవృద్ధులు అయినప్పటికీ.. వీరంతా.. అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి తమ ఓటు వేసి.. మిగతా వారికి ఆదర్శవంతంగా నిలిచారు. 

Latest Updates