చనిపోతూ 8 మందికి ప్రాణం పోసిన కానిస్టేబుల్

తాను మరణిస్తూ మరో 8 మందికి ప్రాణదానం చేశారు కానిస్టేబుల్ ఆంజనేయులు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ స్పెషల్ పార్టీలో ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేశాడు కోనేరి ఆంజనేయులు. 2018 బ్యాచ్ కి చెందిన ఆంజనేయులుది   వికారాబాద్ జిల్లా, పరిగి మండలం, బాబాపూర్ గ్రామం.  ఈ నెల 18 న బైక్ పై డ్యూటీకి వెళ్తుండగా సోమన్ గుర్తి గేటు దగ్గర మన్నెగూడెం వైపు వేగంగా వెళ్తున్న బోలెరో వాహనం వెనుక నుంచి ఢీకొంది. తలకు, శరీరానికి బలమైన గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 21 న ఉదయం చనిపోయాడు. ఆంజనేయులు కుటుంబ సభ్యులను సైబరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనార్  పరామర్శించారు.  సీపీ రిక్వెస్ట్ తో  ఆంజనేయులు గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్, కళ్లు ఇతరులకు ఉపయోగించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ జీవన్ దాన్ కు అప్పగించారు కుటుంబ సభ్యులు. బాధలో ఉండి కూడా మరో 8 మంది ప్రాణాన్ని కాపాడేందుకు ముందుకి వచ్చిన కుటుంబ సభ్యులను అభినందించారు సజ్జనార్.

Latest Updates