ప్రేమ పేరుతో కానిస్టేబుల్ చీటింగ్

పంజాగుట్ట వెలుగు: తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి కానిస్టేబుల్ చీట్ చేశాడని ఓ యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ఇన్ స్పెక్టర్ నిరంజన్ రెడ్డి వివరాల ప్రకారం..మహబూబాద్ జిల్లా చిన్న ముప్పారంకి చెందిన పల్ల గురవయ్య(30) కొండాపూర్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అతనికి ఫ్రెండ్ ద్వారా మలక్ పేటలోని ఓ కాలేజీలో నర్సింగ్ చేస్తున్న యువతితో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు. రెండేళ్లు సన్నిహితంగా ఉండి వేరే యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న సదరు యువతి పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. నిందితుడిని రిమాండ్ కు తరలించినట్టు
ఇన్ స్పెక్టర్ తెలిపారు.

బాచుపల్లిలో ఆటో డ్రైవర్..

నిజాంపేట: ప్రేమ పేరుతో నమ్మించి, పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని ఆటో డ్రైవర్ మోసం చేసిన ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నిజాంపేటకు చెందిన రవిగౌడ్(24) ఆటోడ్రైవర్. జేఎన్ టీయూ సమీపంలోని ఓ హోటల్ కు సరుకులు
సప్లై చేసేవాడు. ఆ టైంలో హోటల్ యజమాని కుమార్తె(22)తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. రవి ఆమెను పెళ్లి చేసుకుంటానని శారీరకంగా లోబరుచుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత పెళ్లికి నిరాకరించాడు. ఆరా తీయగా రవికి అప్పటికే పెండ్లయినట్లు ఆమె తెలుసుకుంది. దీంతో బాధిత యువతి బాచుపల్లి పీఎస్ కు చేరుకొని తనకు రవితో పెళ్లి జరిపించాలని లేకపోతే విషం తాగుతానని ఏడ్చింది. పోలీసులు నచ్చజెప్పి రవిపై చీటింగ్ కేసు నమోదు చేశారు.

see also: బీఎస్‌-6 పల్సర్ వచ్చింది..!

see also: సర్కార్‌‌ సోలార్‌‌ పార్కులు లేనట్లే!

Latest Updates