కానిస్టేబుల్ శ్రీధర్ సస్పెన్షన్

నారాయణ కాలేజీలో చనిపోయిన ఇంటర్ స్టూడెంట్ తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ శ్రీధర్ పై సస్పెన్షన్ వేటు పడింది. కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి SPకి ఆదేశాలు జారీ చేశారు హోంమంత్రి మహమూద్ అలీ. అంతకుముందు ఈ ఘటనపై స్పందించిన మంత్రి కేటీఆర్…హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి కలగజేసుకుని చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా కోరారు దీంతో కానిస్టేబుల్ శ్రీధర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హోంశాఖ.

Latest Updates