వికారాబాద్ ఘటనలో కానిస్టేబుల్ ను బదిలీ చేసిన ఎస్పీ

constable-srinivas-transfor-to-ar-vikarabad-sp

వికారాబాద్ లో  ఇద్దరు వ్యక్తులపై దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ శ్రీనివాస్ ను ఎస్పీ ట్రాన్స్ ఫర్ చేశారు. శ్రీనివాస్ ను ఏఆర్ కు ట్రాన్స్ ఫర్ చేశారు . పూర్తి విచారణ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎస్పీ.

వికారాబాద్ లో  రోడ్డుపై వాహనాలను చెక్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు తాగిన మత్తులో వచ్చి పోలీసులను ఢీ కొట్టారు. అంతేగాకుండా దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసులకు, తాగుబోతులకు మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులపై కానిస్టేబుల్ శ్రీనివాస్ చేయి చేసుకున్నారు. ఈ విషయం వికారాబాద్ ఎస్పీ దృష్టికి వెళ్లడంతో కానిస్టేబుల్ శ్రీనివాస్ ను ట్రాన్స్ ఫర్ చేశారు.

 

 

Latest Updates