జాబ్ పోయి.. భార్య దూరమవడంతో కానిస్టేబుల్ సూసైడ్

ఉద్యోగం పోయిందనే బాధతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మోతీనగర్‌లో జరిగింది. నాగర్ కర్నూల్‌కి చెందిన రాజేంద్ర.. యూసుఫ్‌గూడ పోలీస్ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసేవాడు. మోతీనగర్, స్నేహపురి కాలనీలో కుటుంబంతో సహా నివసిస్తోన్న ఆయన.. విధుల్లో నిర్లక్ష్యం వహించాడనే కారణంతో ఏడు నెలల క్రితం సస్పెండ్ అయ్యాడు. దాంతో ఇంట్లోనే ఉంటున్న రాజేంద్రకు భార్యకు విభేదాలు వచ్చాయి. దాంతో వారిద్దరూ వేరుపడ్డారు. జాబ్ పోవడం మరియు భార్యాపిల్లలు దూరమవడంతో మనస్థాపానికి గురై తన ఆస్తి మొత్తం తన పిల్లలకు చెందాలని సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఆల్ టైం రికార్డుకి సెన్సెక్స్.. దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు

అమ్ముడుపోని టిక్కెట్‌కు రూ. 12 కోట్ల లాటరీ

వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రిషబ్ పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Latest Updates