కానిస్టేబుల్​ లవ్​లెటర్​.. నక్సలిజంపై ప్రేమ గెలిచింది

  •                 ఉద్యమంలో  ప్రేమ.. ఒప్పుకోని ‘పెద్ద’ అన్నలు   
  •                 బయటికొచ్చి కానిస్టేబుల్ అయిన ప్రియుడు 
  •                 ప్రియుడి కోసం వచ్చేసిన ప్రియురాలు   

వాళ్లిద్దరూ నక్సల్స్. ఉద్యమంలో ఉండగా ప్రేమించుకున్నారు. కొన్నాళ్లకు ప్రేమికుడు పార్టీని వీడి బయటకొచ్చి పోలీసు ఉద్యోగంలో చేరాడు. అతడి ప్రేమలేఖ పిలుపుతో ప్రియురాలు తుపాకీ వదిలేసి జనజీవన స్రవంతిలోకి వచ్చేసింది. ఈ ప్రేమలేఖ వ్యవహారం దండకారణ్యంలో చర్చనీయాంశంగా మారింది.

2013లోనే లవ్ స్టోరీ షురూ 

ఛత్తీస్​గఢ్ లోని దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ ఇంద్రావతి ఏరియా కమిటీ దళ సభ్యులుగా జయోస్తామ్, లక్ష్మణ్ 2013లో ఒకరికొకరు పరిచయమయ్యారు. వారిద్దరి మధ్య కొద్దిరోజుల్లోనే ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యారు. పార్టీ అధిష్టానానికి విన్నవించగా ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో లక్ష్మణ్‍ కొంతకాలం క్రితం ఉద్యమం నుంచి బయటకు వచ్చేశాడు. ఛత్తీస్‍గఢ్‍ డీఆర్‍జీ(డిస్ట్రిక్ట్ రిజ్వర్డ్ గార్డు) విభాగంలో కానిస్టేబుల్‍గా ఉద్యోగం సాధించాడు. దంతెవాడ జిల్లాలోనే డ్యూటీ చేస్తున్నాడు. ఉద్యమంలోనే ఉన్న జయోస్తామ్‍ను మరిచిపోలేకపోయాడు. ఇప్పటికీ ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నాడో వివరిస్తూ లవ్ లెటర్ రాశాడు. ఆ లెటర్ అందుకున్న జయోస్తామ్.. ఉద్యమాన్ని వీడి వచ్చేస్తానని ఇటీవల ఎస్పీ అభిషేక్ కు కబురు పంపింది. ఆయన దంతేశ్వరీ ఫైటర్స్ మహిళా కమాండోలను ఇంద్రావతి నదీ తీరానికి పంపారు. అడవిని వీడి.. నదిని దాటి కోకేర్ గ్రామం వద్దకు చేరుకున్న జయోస్తామ్ ను మహిళా కమెండోలు సేఫ్​గా దంతెవాడకు తీసుకొచ్చారు. ఎస్పీ, పోలీసుల సమక్షంలో.. కానిస్టేబుల్ లక్ష్మణ్, జయోస్తామ్ ఒక్కటయ్యారు.

Latest Updates