
వరంగల్ అర్బన్ జిల్లా: తన భర్త నుంచి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ అర్బన్ జిల్లాలో ఓ కానిస్టేబుల్ భార్య ధర్నాకు దిగింది. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న తన భర్త ఓంకార్.. పెళ్లి అయినప్పటి నుంచి తనను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నాడంటూ పోగు దీప అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సోమవారం పెద్దల సమక్షంలో పంచాయతీ జరగాల్సి ఉండగా రాత్రికి రాత్రే తమ సామాన్లను.. తన తల్లిదండ్రులు కట్నంగా ఇచ్చిన భూమిలో తన భర్త పడేసి పోయాడని వాపోయింది. ఇప్పుడు తన పరిస్థితి ఏంటంటూ సామాన్లు పడేసిన చోటనే తన మూడేళ్ల కొడుకుతో కలిసి బైఠాయించి కమలాపూర్ లో ఆందోళన చేస్తోంది.