శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ దగ్గర అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణం

ఆంధ్రప్రదేశ్ లో అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అణు విద్యుత్ కేంద్ర ఏర్పాటుకు సంబంధించి రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్రం సమాధానమిచ్చింది. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ దగ్గర ఈ ప్లాంటును నిర్మించబోతున్నామని… 1,208 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 6 అణు రియాక్టర్లను ప్లాంటులో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం అమెరికాకు చెందిన ‘వెస్టింగ్ హౌస్ ఎలెక్ట్రిక్’ సంస్థతో చర్చలు జరుపుతున్నామని చెప్పింది. పలు అధ్యయనాల తర్వాత కొవ్వాడ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్టు చెప్పింది.

Latest Updates