అభివృద్ధిలో భాగమయ్యే ప్రతి కంపెనీకి మా సహకారం ఉంటుంది

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సింగపూర్ కంపెనీలకు పూర్తి సహకారం అందిస్తామన్నారు మంత్రి కేటీఆర్. పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలంగా ఉంటుందన్నారు. మాసబ్ ట్యాంక్ లోని కార్యాలయంలో కేటీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్ పొంగ్ కాక్ టియాన్ కు మంత్రి ఘన స్వాగతం పలికారు. రెండు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలపై ఇద్దరు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా మినిస్టర్ కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి, అభివృద్ధిలో భాగమయ్యే ప్రతి కంపెనీకి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు. కాలుష్య రహిత ఫార్మాసిటీ ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు సింగపూర్‌-చెన్నై కాన్సూల్‌ జనరల్‌ పాంగ్‌ కోక్‌ టియాన్‌, వైస్‌ కాన్సూల్‌ మిస్టర్‌ ఇవాన్‌, ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేష్‌ రంజన్‌, తదితరులు పాల్గొన్నారు.

Consul General of Singapore Mr. Pong Kok Tian met KTR in Hyderabad

Latest Updates