ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

కూలీల ఆటోను ఢీకొన్న లారీ 

నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం అంగడిపేట వద్ద ప్రమాదం

మరో 10 మందికి తీవ్ర గాయాలు.. పలువురి పరిస్థితి విషమం

నల్గొండ: పీఏ పల్లి మండలం అంగడిపేట వద్ద.. నాగార్జునసాగర్ -హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న  ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢొకొట్టింది. వేగంగా ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా తీవ్రంగా గాయపడ్డారు. ఆటో డ్రైవర్ తోపాటు మరో నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగా మరొకరు చనిపోవడంతో మృతుల సంఖ్య 6 కి చేరింది.  ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 20 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది.  ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా రోజువారీ కూలీ చేసుకునేవారేనని, చనిపోయిన వారంతా మహిళలేనని గుర్తించారు. మరో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిది దేవరకొండ మండలం చింతబాయి గ్రామంగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 20 మంది వరకు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని దేవరకొండ ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి..

కసితో ఆడాను.. వికెట్ తీసిన ప్రతిసారి నాన్నే గుర్తుకొచ్చారు…

ఎయిర్ పోర్టు నుంచి నేరుగా తండ్రి సమాధి వద్దకు..

తండ్రీ కొడుకుల వాట్సప్ చాట్.. సైబరాబాద్ పోలీసుల ట్వీట్

డ్రగ్స్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రాగిణికి బెయిల్

Latest Updates