నడుచుకుంటు వెళ్తున్న వారిపై దూసుకెళ్లిన కంటేయినర్

సంగారెడ్డి: పఠాన్ చేరు మండలం ఇస్నాపూర్ సమీపంలో జాతీయ రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులపైకి కంటేయినర్ దూసుకుపోయింది. ఈ ఘటనలో ఇద్దరు బీహార్ వాసులు మృతిచెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని సంగారెడ్డి హస్పిటల్ కు తరలించారు. చనిపోయినవారు పారిశ్రామిక వాడాలో కార్మికులుగా పని చేస్తున్నారని.. విధులు ముగించుకొని ఇంటికి రోడ్ పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు స్థానికులు. డెడ్ బాడీలను పోస్ట్ మార్టమ్ కోసం గాంధీ హస్పిటల్ కు తరలించిన పోలీసులు. ఒక ట్రక్కు మరో కంటైనర్ ను ఓవర్ టేక్ చేస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు అన్నారు.

Latest Updates