గ్రేట‌ర్ హైదరాబాద్ లో 65కి త‌గ్గిన కంటైన్మెంట్ జోన్స్

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే గ్రేటర్ పరిధిలో మాత్రం పాజిటివ్ కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుతోంది. గత నాలుగు రోజులుగా 500 కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. GHMCలో కరోనా కేసులు తగ్గుతుండటంతో.. కంటైన్మెంట్ జోన్ల సంఖ్య తగ్గుతోంది. జూలై 30 వరకు గ్రేటర్ హైదరాబాద్‌లో 92 కంటైన్మెంట్ జోన్లు ఉండగా ఇవాళ్టికి(బుధవారం) 65 కంటైన్మెంట్ జోన్లు మాత్రమే ఉన్నాయి.

రెండు వారాల క్రితం ఎల్బీ నగర్‌లో ఐదు కంటైన్మెంట్ జోన్లు ఉండగా.. ఆ సంఖ్య ఇప్పుడు 6కు చేరింది. గతంలో చార్మినార్ ఏరియాలో అత్యధికంగా 31 కంటైన్మెంట్ జోన్లు ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతం 15 కంటైన్మెంట్ జోన్లు మాత్రమే ఉన్నాయి.  ఖైరతాబాద్‌లో రెండు వారాల క్రితం 14 కంటైన్మెంట్ జోన్లు ఉండగా.. ప్రస్తుతం 21కి పెరిగాయి. సికింద్రాబాద్ జోన్‌లో అయితే ప్రస్తుతం ఐదు కంటైన్మెంట్ జోన్లు.. శేరిలింగంపల్లి జోన్‌లో 10 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ఇక గతంలో కూకట్‌పల్లి జోన్‌లో 9 కంటైన్మెంట్ జోన్లు ఉండగా.. ప్రస్తుతం 8 కంటైన్మెంట్ జోన్లు మాత్రమే ఉన్నాయి.

Latest Updates