రెబల్ గా పోటీ చేస్తా.. టీఆర్ఎస్ ను ఓడిస్తా

తాండూరు,వెలుగు : సిట్టింగ్​ కౌన్సిలర్​గా తమకు కాకుండా రెడ్డి సామాజిక వర్గానికి టిక్కె ట్ ఇవ్వడం అన్యాయం అని టీఆర్​ఎస్ నాయకుడు హరిహరగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి,ఎమ్మెల్సీ మహేందర్​రెడ్డి ఇన్నాళ్లు గ్రూప్ రాజకీయాలు పోషించి టిక్కెట్ల పంపకాల్లో కుమ్మ క్కయ్యా రని ఆరోపించారు. 13వ వార్డులో తాను రెబల్ గా పోటీచేసి టీఆర్​ఎస్ ను ఓడిస్తానని శపథం చేశారు. తనతో పాటు మరి కొందరికి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Latest Updates