కొత్త ఫ్లేవర్లలో కాంటినెంటల్‌‌ కాఫీ

హైదరాబాద్‌‌, వెలుగు: కాంటినెంటల్‌‌ కాఫీ నాలుగు కొత్త ఫ్లేవర్స్‌‌  (త్రీ ఇన్‌‌ వన్‌‌ ప్రిమిక్స్‌‌) ‘దిస్‌‌’ బ్రాండ్‌‌ పేరిట మార్కెట్లోకి తెచ్చింది. హాజిల్‌‌నట్‌‌, క్యాపచినో, మోచా,కేరమెల్‌‌ ఫ్లేవర్లలో ఇది దొరుకుతుంది. 22 గ్రాముల సాచెట్‌‌ను రూ. 20 కి విక్రయించనున్నట్లు పేర్కొంది.

అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌, బిగ్‌‌ బాస్కెట్‌‌ వంటి ఈ–కామర్స్‌‌ ప్లాట్‌‌ఫామ్స్‌‌, పెద్ద సూపర్‌‌మార్కెట్‌‌ చెయిన్స్‌‌ అన్నింటిలోనూ దిస్‌‌ అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. కాఫీ కల్చర్‌‌ మారుతున్న నేపథ్యంలో మిలినియల్స్‌‌ అభిరుచులకు అనుగుణంగా ఈ వెరైటీలను తెస్తున్నట్లు కాంటినెంటల్‌‌ తెలిపింది.

Latest Updates