ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో స్వేచ్ఛకు సంకెళ్లు !

టెక్నాలజీలో ఇప్పుడు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​‌‌– ఏఐ)దే హవా. ఫోన్లు, ఇంటర్నెట్, డిజిటల్ వాయిస్ అసిస్టెంట్లు, నెట్ ఫ్లిక్స్​.. ఒక్కటేమిటి ప్రతి దాంట్లోనూ అదే. ఇప్పటికే చాలా జాబుల్లోనూ అది చేరిపోయింది. చిన్నచిన్నగా ఉద్యోగాలను తగ్గిస్తోంది. కానీ, అదే ఏఐ వల్ల ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు వచ్చే అవకాశముందని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు. అమెరికాలోని బోయిస్ స్టేట్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ 90 దేశాల్లో ఏఐ వాడకంపై రీసెర్చ్​ చేసి ఈ హెచ్చరికలు చేస్తోంది.

ప్రజల మీద ఎప్పుడూ నిఘా పెట్టేందుకు, జనాన్నిఎప్పటికప్పుడు నియంత్రించేందుకు, సెన్సార్​ చేసేందుకు మైక్రోసాఫ్ట్​తో ఓ ఏఐ సిస్టమ్ ను తయారుచేయించింది చైనా నేషనల్‌ డిఫెన్స్‌‌ టెక్నాలజీ యూనివర్సిటీ. వెంటనే అమెరికా ఓపెన్​గా ఖండించింది.ఇలాంటి నిర్ణయాలే వేరే దేశాలూ తీసుకుంటే ..ప్రభుత్వం, ప్రజల మధ్య నమ్మకం పోయి గొడవలు చెలరేగే ప్రమాదం లేకపోలేదంటున్నారు సైంటిస్టులు, నిపుణులు. జనాన్ని అనుక్షణం ట్రాక్ చేస్తూ నిఘాపెట్టడం డేంజర్​ అంటున్నారు. ప్రజాస్వామ్య దేశాలూ ఇప్పుడు వాటివైపే చూస్తుండడం ఆందోళన కలిగించే విషయమంటున్నారు. నియంత పోకడలున్న దేశాల్లో వీటి ద్వారా ఎప్పుడూ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంటుందని, హక్కుల కార్యకర్తల గొంతులను నొక్కేసే ముప్పు ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చైనా తన ఏఐ టెక్నాలజీలను ఎగుమతి చేస్తుండడం మరింత కలవరపరిచే అంశమంటున్నారు.

అమెరికాలోనూ
పెరిగింది
ప్రస్తుతం ప్రతి దేశంలోనూ ఏఐ వాడకం పెరుగుతోంది. మరి, అగ్రరాజ్యం అమెరికా గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎక్కడకావాలంటే అక్కడ.. క్షణాల్లో సమాచారమంతా చేతికొచ్చేస్తుండడంతో ప్రభుత్వాలకు పని తేలికౌతోంది. అమెరికాలో 1970ల్లోనే ఎఫ్ బీఐ, సీఐఏ, ఎన్​ఎస్​ఏ వంటి రక్షణ శాఖల్లో డొమెస్టిక్ సర్వైలెన్స్​ నెట్​వర్క్స్ ను ఏర్పాటు చేశారు. ఆ వ్యవస్థ ద్వారా పౌర హక్కుల కార్యకర్తలు, రాజకీయ కార్యకర్తలు, నేటివ్ అమెరికన్లను నిరంతర నిఘాలో పెట్టేవాళ్లు. చాన్స్​ దొరికినప్పుడల్లా వేధించేవాళ్లు. ఇప్పుడు డిజిటల్​ యుగం మరింతముదిరింది. మరింత కట్టుదిట్టమైన, పటిష్టమైన నిఘాపెట్టే చాన్స్​ వాటికి దొరికింది.

ప్రస్తుతం అమెరికా పోలీసులు ఏఐ వ్యవస్థలను పెట్టేశారు. ఎక్కడెక్కడనేరాలు జరిగే అవకాశాలున్నాయో ముందే తెలుసుకునే ఓ సాఫ్ట్​వేర్​నూ పెట్టిస్తున్నారు. క్రిమినల్​ దర్యాప్తుల్లో ఫేషియల్​ రికగ్నిషన్​, డీఎన్​ఏ అనాలిసిస్​ వంటి టెక్నాలజీలను వాడుకుంటున్నారు. వాటి ద్వారా పోలీసులకు గిట్టని ఆఫ్రికన్​ అమెరికన్​ పౌరులను కేసుల్లో ఇరికించేందుకు ఆ సాఫ్ట్​వేర్​ను కాంప్రమైజ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎక్కువగా వాళ్లపైనే ఇలాంటి డేటాబేస్​ల ద్వారా తప్పుడు కేసులు బనాయిస్తున్న సందర్భాలు అనేకం అంటున్నారు.

ఫేక్ సమాచారం బెడద
నియంతృత్వ దేశాల్లోని ప్రభుత్వాలు సమాచారాన్ని దుర్వినియోగం చేసి ఫేక్ సమాచారాన్ని వ్యాప్తి చేసేఅవకాశమూ లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, వీడియోలు, ఆడియోలను ఆల్గా రిథంలతో ఫేక్ చేసే అవకాశాలున్నాయని, వాటిని గిట్టనివారిపై ప్రయోగించే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ప్రత్యేకించి ఎన్నికల్లో వాటి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందంటున్నారు.

నియంతృత్వ దేశాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే, ప్రజలగొంతు వినిపించేందుకు అక్కడ ఆస్కారమే లేదు. అలాంటి దేశాల్లో ప్రజల మీద నిఘా పెంచేందుకుఈ ఏఐ ఓ పెద్ద ఆయుధంలా మారిందంటున్నారు పరిశోధకులు. భద్రతా బలగాల చేతుల్లో కోట్లాదిమంది సమాచారం ఉందంటున్నారు. సోషల్​ మీడియా పోస్టులు, మెసేజ్ లు, ఈమెయిళ్లు, ఫోన్​ కాల్స్​ వంటివన్నీ వాళ్లకు చేరిపోతున్నాయని హెచ్చరిస్తున్నారు. వాటి ఆధారంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని వెంటనే అరెస్ట్​ చేసి గొం తు నొక్కేస్తున్నారు. ఉదాహరణగా చైనానే తీసుకుంటే.. షిన్​జియాంగ్​, టిబెట్​ వంటి ప్రాంతాల్లో ‘ఒర్వె లియన్​’ అనే ఏఐ నిఘా ద్వారా మైనారిటీలపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతోంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరి డీఎన్​ఏ శాంపిళ్లనూ తీసుకుంది. వైఫై నెట్​వర్క్​ మానిటరింగ్​, ఫేషియల్​ రికగ్నిషన్​ కెమెరాలను పెట్టింది. ఈ వ్యవస్థల ద్వారా దాదా 20లక్షల మందిని చైనా నిర్బంధించిందని అమెరికా విదేశాంగశాఖ ఆరోపిస్తోంది. దాదాపు బంగ్లాదేశ్, థాయ్ లాండ్ , టర్కీ, కెన్యా సహా 54 దేశాలకుచైనా తన ఏఐ సర్వైలెన్స్​ టెక్నాలజీని ఎగుమతిచేస్తోంది. బెల్ట్​ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్​ఐ)లో భాగంగానే సరఫరా చేస్తోందంటున్నారు.

స్మార్ట్ సిటీలు
పాకిస్థాన్​, ఫిలిప్పీన్స్​, కెన్యా వంటి దేశాల్లో చైనా కంపెనీలైన హువావే, జడ్ టీఈలు స్మార్ట్​ సిటీలు కడుతున్నాయి. అందులో భాగంగా బిల్ట్​ఇన్​గా సర్వైలెన్స్​ టెక్నాలజీలను పెట్టేస్తున్నాయి. అంటే ఎక్కడికక్కడ నగరం మొత్తం నిఘా నీడన ఉంటుందన్న మాట. ఉదాహరణకు ఫిలిప్పీన్స్​లోని బొనిఫేషియో గ్లోబల్​ సిటీనే తీసుకుందాం. హైడెఫినేషన్​ కెమెరాలను ఇన్​బిల్ట్​గా పెట్టారు.నేరాలు, ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు మానిటర్​ చేసేలా 24 గంటలూ అవి నిఘా వేస్తాయన్నమాట. సింగపూర్​ వంటి దేశాల్లో హిక్ విజన్​, యిటూ, సెన్స్​టైమ్ వంటి సంస్థలు ఫేషియల్​ రికగ్నిషన్​ కెమెరాలను సరఫరా చేస్తున్నాయి. ఆ దేశం ప్రకటించిన సర్వైలెన్స్​ ప్రోగ్రామ్ లోభాగంగా లక్షా పదివేల కెమెరాలను అమర్చ-నున్నారు. జిం బాబ్వేలో ఫేషియల్​ రికగ్నిషన్​ కోసం నేషనల్​ ఇమేజ్ డేటాబేస్​ను ఏర్పాటుచేస్తున్నారు. వీటి ద్వారా చైనా సొమ్ము చేసుకో-వడమే కాకుం డా.. భౌగోళిక రాజకీయాల (సరి-హద్దు ఆక్రమణలు) కోసం ఆయా దేశాలనుతన చెప్పు చేతల్లో పెట్టుకునేం దుకు చైనా ఎత్తు-గడలు పన్నుతోం ది. చైనా అజెం డాను ఆయాదేశాల ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు

Latest Updates