మళ్లొస్తే ఆప తరం కాదు

  • ఇప్పుడే కట్టడి చేయాలని అమెరికా సీడీసీ సూచన

న్యూయార్క్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను ఇప్పుడే కట్టడి చేయాలని అమెరికాలోని సెంట్రల్ ఫర్ డిసీజ్ (సీడీసీ) తెలిపింది. మళ్ల వచ్చిందంటే ఆపుడు తరం కాదని సీడీసీ డైరెక్టర్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ హెచ్చరించారు. చలికాలం వచ్చే నాటికి కరోనాను ఖతం చేయాలన్నారు. లేదంటే ఫ్లూ సీజన్ కు తోడు కరోనా మొదలైందంటే మొత్తం హెల్త్ సిస్టమ్ దెబ్బతింటుందన్నారు. ప్రస్తుతం కరోనా నుంచి బయటపడినట్లు భావిస్తున్న దేశాలు సంతోష పడాల్సిన అవసరం లేదని…మళ్ల వైరస్ సోకితే ప్రమాదం తప్పదని చెప్పారు. కరోనాకు వ్యాక్సిన్ రావటమో లేదంటే పూర్తిగా వైరస్ నిర్మూలించే వరకు అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. జపాన్, సౌత్ కొరియా, చైనాలో వైరస్ తగ్గిందనుకుంటే మళ్లీ కొత్త కేసులు నమోదవతున్న విషయాన్ని రాబర్ట్ గుర్తు చేశారు. అమెరికాలో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్న లాక్ డౌన్ ఎత్తివేయాలంటూ పలు రాష్ట్రాల గవర్నర్లు కోరుతుండటాన్ని రాబర్ట్ తప్పుబట్టారు. తన హెచ్చరికలను కొంతమంది పట్టించుకోవటం లేదని…దానికి భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ నాటికి కరోనాను ప్రపంచం నుంచి తరిమేయాలని సూచించారు.

Latest Updates