‘మెంటల్‌‌ హై క్యా’ పై సెటైర్లు

అందరినీ ఆడిపోసుకుంటూ ఉంటుందని కంగనాకి పేరు. కానీ ఇప్పుడు రివర్స్‌‌లో కంగనానే అడిపోసుకుంటున్నారు కొందరు. దానికికారణం.. ‘మెంటల్‌‌ హై క్యా’ చిత్రం. రాజ్‌‌కుమార్ రావ్, కంగనా ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ మూవీని ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజైన ఫస్ట్​లుక్ లో హీరో హీరోయిన్లిద్దరూ నాలికలు చాపివుంటే, వాటి మీద ఓ బ్లేడ్ నిలబెట్టి ఉంది. ఈ పోస్టర్ చాలా మందికికోపం తెప్పించింది. ఇలాంటి విన్యాసాలు చేయడం అవసరమా, పిల్లలు ట్రై చేస్తే ఏంటి పరిస్థితి అంటూ మండిపడ్డారు. దానికితోడు సినిమా టైటిల్‌‌ కూడా మానసిక వ్యాధి గ్రస్తుల్ని కించపర్చేలా ఉందంటూ ఇండియన్​ సైకియాట్రిక్ సొసైటీవాళ్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వారికి ఒకలేఖ పంపారు. వెంటనే టైటిల్ మార్చాలని, మెంటల్ డిజార్డర్ ఉన్నవారిని చులకన చేసేలా ఎలాంటి సీన్స్ ఉన్నా తొలగించాలన్నది ఆ లేఖ సారాంశం. దీనిపై మూవీ టీమ్ ఇంకా స్పందించలేదు.

ప్రతిదానికీ కస్సుమని లేచే కంగన కూడా ఇంతవరకూ రియాక్టవ్వలేదు. అయితే సోషల్ మీడియాలోమాత్రం బాగా ట్రోలింగ్ జరుగుతోంది. ఇలాంటి టైటిల్ పెట్టడం, పిచ్చిప్రయోగాలు చేయడం అవసరమా, మీకు‘మెంటల్‌‌ హై క్యా’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. అది మాత్రమే కాక మరో విషయంలో కూడా కంగన గురించి కామెంట్ లు చేస్తున్నారు. ‘తలైవి’ చిత్రంలో జయలలితపాత్రలో నటిస్తోందామె . అయితే ఈ పాత్రకి మొదట విద్యా బాలన్‌ ని అడిగారట దర్శక నిర్మాతలు. కానీ ఆల్రెడీ తాను ఇందిరా గాంధీ పాత్రచేస్తోంది కనుక రెండు బయోపిక్స్‌‌ ఏకకాలంలో వద్దనుకుని నో చెప్పిందట విద్య. ఆ తర్వాతే ఆ రోల్ కంగనకు ఆఫర్ చేశారట. ఈ విషయాన్ని విద్య స్వయంగా ఓఇంటర్వ్యూలో చెప్పడంతో… ఆమె కాదంది కనుకే కంగనకు చాన్స్ దక్కిందని కొందరు ఎద్దేవా చేస్తున్నారు. మరి ప్రతిదానికీ మాటలతోనే నిప్పులు కురిపించే కంగన..ఈ మాటలన్నిటికీ ఎలా రియాక్టవుతుందో చూడాలిక.

Latest Updates