ప్రకృతికి హానికలిగిస్తున్న గ్యాస్​పొయ్యిలు

కార్బన్​ డయాక్సైడ్​తో పోలిస్తే ఎక్కువ ఎఫెక్ట్​

అమెరికా నిపుణుల వార్నింగ్‌

గ్యాస్​ వాడకాన్ని తగ్గించాలని సూచనలు

ఇప్పటికే అమెరికాలో కొన్ని చోట్ల నిషేధం

చట్టం తెచ్చేందుకు మరికొన్ని రాష్ట్రాలు సిద్ధం

కార్బన్​ డయాక్సైడ్​ చేసే నష్టంతో పోలిస్తే ఈ గ్యాస్​తో కలిగే నష్టమే ఎక్కువని వాళ్లంటున్నారు. దీనిపై ఇప్పుడు అమెరికాలో పెద్ద చర్చే నడుస్తోంది. కొన్ని చోట్ల ఈ గ్యాస్​ స్టవ్​లను నిషేధించాలని లేదంటే పరిమితం చేయాలన్న ప్రతిపాదనలు ఇప్పటికే ఊపందుకున్నాయి. ఇప్పటికే కాలిఫోర్నియాలోని బర్కిలీలో గ్యాస్​ స్టవ్​లను నిషేధించేశారు.

గ్యాస్​తో ఎలా హాని?

గ్యాస్​తోనూ హాని జరుగుతోందంటున్నారు కొందరు నిపుణులు. ఇంట్లో వాడుకునే సిలిండర్లతో పాటు, పైపులతో సరఫరా చేసే గ్యాస్​ వరకూ పర్యావరణానికి హాని చేస్తున్నాయన్నది వారి వాదన. గ్యాస్​ మండినా, లేదంటే ఆ గ్యాస్​ లీకైనా వాతావరణం వేడెక్కి పోతోందని వారు అంటున్నారు. దానికి ఆధారాలూ చూపిస్తున్నారు. గ్యాస్​ను సరఫరా చేసే పైపులు, కంప్రెషన్​ స్టేషన్ల నుంచి గ్యాస్​ లీకై టెంపరేచర్లు పెరిగిన సంఘటనలను ఎత్తి చూపారు. ఆ వేడి బండ్లు, ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే కార్బన్​ డయాక్సైడ్​ ఉద్గారాల కన్నా ఎక్కువుందని వివరించారు. అందుకే మనం సహజంగా లభించే ఆ గ్యాస్​ వాడకాన్ని తగ్గిస్తేనే బెటర్​ అంటున్నారు.

కరెంట్​ తయారీకీ అక్కడ గ్యాసే..

అమెరికాలో గత ఏడాది రోజువారీ అవసరాల కోసం (ఇళ్లు, హోటళ్లు వంటివి) 8.45 ట్రిలియన్​ క్యూబిక్​ ఫీట్​ (టీసీఎఫ్​)ల గ్యాస్​ను వాడుకుంటే, కరెంట్​ కోసం 10.63 టీసీఎఫ్​లను వాడేశారట. అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్​ అడ్మినిస్ట్రేషన్​ (ఈఐఏ) చెప్పిన లెక్కలివి. అంటే మామూలు అవసరాలతో పోలిస్తే కరెంట్​కే ఎక్కువ గ్యాస్​ను లాగేస్తున్నారన్నమాట.

అమెరికా రాష్ట్రాల్లో నిషేధం

ఇలా గ్యాస్​ వల్ల పర్యావరణంపై ఎఫెక్ట్​ పడుతోంది కాబట్టే గ్యాస్​ను నిషేధించే ప్రయత్నం చేస్తున్నామని అమెరికా అధికారులు చెబుతున్నారు. బర్కిలీనే స్ఫూర్తిగా తీసుకుని లాస్​ఏంజిలిస్​, సియాటిల్​, మిన్నెపోలిస్​ వంటి రాష్ట్రాల్లోనూ గ్యాస్​ వాడకాన్ని తగ్గించేందుకు లేదంటే నిషేధించేందుకు రెడీ అవుతున్నారు. చట్టం చేసేందుకు సిద్ధమవుతున్నారు. చాలా నగరాలు ఇప్పటికే దాన్ని అమలు చేస్తున్నాయి. చట్టాలూ అమల్లోకి వచ్చాయి. బోస్టన్​, శాన్​ లూయిస్​, శాన్​జోస్​, పాలో ఆల్టో, సన్నీవాల్​, మినెసొట్టా, న్యూయార్క్​ వంటివి అమలు చేసేందుకు రెడీ అవుతున్నాయి. కొత్త బిల్డింగులకు గ్యాస్​ పర్మిషన్లను ఇవ్వొద్దని అధికారులు డిసైడ్​ అయ్యారు. పాత బిల్డింగులకు వేరే ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

మరి, వేటిని వాడాలి?

రెన్యువబుల్​ ఎనర్జీ.. పునరుత్పాదక కరెంట్​! అవును, సూర్యుడు, గాలి నుంచి తయారు చేసే కరెంట్​ను వాడుకోవాలి. వంట కోసమూ ఎలక్ట్రిక్​ స్టవ్​లకు మారాలి. ఇప్పుడు దాని మీదే అమెరికా రాష్ట్రాలు పెద్ద ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికాలో రెన్యువబుల్​ ఎనర్జీ ఉత్పత్తి పెరిగింది. పదేళ్ల కిందట 9 శాతంగా ఉన్న ఆ కరెంట్​ ఉత్పత్తి, ఇప్పుడు 17 శాతానికి పెరిగింది. దానిని మరింత పెంచేందుకు ముందుకు సాగుతున్నారు. చిన్నచిన్నగా గ్యాస్​ను నిషేధిస్తే కంపెనీలు, పర్యావరణానికి మేలు చేసే ఈ పునరుత్పాదక కరెంట్​ వైపు అడుగులు వేస్తారని అంటున్నారు.

అయితే, కొన్ని గ్యాస్​ కంపెనీలు, పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. గ్యాస్​ను నిషేధిస్తే తమకు భారీ నష్టం తప్పదని అంటున్నారు. ఈ మధ్యే వాళ్లు సమావేశమయ్యారు కూడా. అమెరికా తీసుకున్న ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే, పర్యావరణవేత్తలు మాత్రం దాన్ని అమలు చేసి తీరాల్సిందేనని చెబుతున్నారు. ఇది ఒక్క అమెరికాకు మాత్రమే పరిమితం కాదంటున్నారు. ఇతర దేశాలూ దీనిపై ఆలోచించాల్సిన  అవసరముందంటున్నారు.

Latest Updates