రేపిస్టులకు సహకరిస్తే చంపరు : దర్శకుడి సంచలన వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు అందరిని కలచివేస్తున్నాయి. ఈ సమయంలో లైంగిక వేధింపులపై చిత్ర దర్శకుడు డానియల్ శ్రావణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా మిమ్మల్ని రేప్ చేయడానికి వస్తే పోలీసులకు ఫోన్ చేసే బదులు.. వారికి కండోమ్‌లు ఇచ్చి సహకరించాలని ఆయన అన్నారు. అలా సహకరించినట్లయితే రేప్ తర్వాత మిమ్మల్ని చంపకుండా వదిలేస్తారని ఆయన అన్నారు.

శ్రావణ్ ఒక పోస్ట్‌లో ‘‘అత్యాచారం తీవ్ర నేరం కానేకాదు, కానీ.. హత్య చేయడం మాత్రం క్షమించరానిది. సమాజం మరియు మహిళా సంఘాల వల్లే దోషులు రేప్ చేసిన తర్వాత మహిళలను చంపేస్తున్నారు. అత్యాచారాలకు కేసుల నుంచి మినహాయింపునిస్తే.. దోషులకు భాదితులను చంపాలనే ఆలోచన రాదని’’ రాశారు. ఇప్పుడు ఆ పోస్ట్‌ని శ్రావణ్ తొలగించాడు.

More News

లవ్ మ్యారెజ్ చేసుకున్న 20 రోజులకే మృతి

హైదరాబాద్‌లో అక్కడ దెయ్యాలున్నాయట!

అంతేకాకుండా.. ‘‘అత్యాచారాలను నిరోధించాలంటే.. హింస లేని అత్యాచారాలను చట్టబద్ధం చేయాలి. అదే అత్యాచార బాధితులను చంపకుండా నియంత్రించడానికి ఏకైక మార్గం. హత్య చేయడం పాపం, నేరం. కానీ, అత్యాచారం చేయడం నేరం కాదు. నిర్భయ చట్టం ద్వారానో లేదా ప్రియాంక చట్టం ద్వారానో బాధితులకు న్యాయం జరగదు. మూడొచ్చిన సమయంలో లైంగిక అవసరాలు తీర్చుకోవడం కోసమే చాలా మంది అత్యాచారం చేస్తార’’ని శ్రావణ్ తన ఫేస్‌బుక్ పేజీలో రాశాడు.

‘‘ఎవరైనా వారి లైంగిక అవసరాలను తీర్చుకోవడం కోసం మాత్రమే అత్యాచారం చేస్తారు. అటువంటి వారిని సమాజం, కోర్టు మరియు మహిళా సంఘాలు ఏమీ అనకుండా వదిలేస్తే.. దోషులు బాధితులను క్రూరంగా హత్య చేయకుండా వదిలేస్తారు’’ అంటూ కూడా శ్రావణ్ తన ఫేస్‌బుక్ పేజీలో రాశాడు.

వీటన్నింటిపై స్పందించిన ఒక ఫేస్‌బుక్ యూజర్‌.. శ్రావణ్ మానసిక స్థితి సరిగా లేదని, వెంటనే మానసిక వైద్యుడిని సంప్రదించాలని ఆయనకు సూచించారు. దీనికి సమాధానమిచ్చిన శ్రావణ్.. రేపిస్టుల ప్రతిపాదనకు మహిళలు ఒప్పుకోకపోతే అత్యాచారం చేయడం తప్ప వేరే మార్గం లేదని ఆయన అన్నారు. దాంతో మరో వ్యక్తి ‘నీ కుటుంబంలోని మహిళలకు కూడా ఇలానే చెప్తావా’ అని శ్రావణ్‌ని అడిగాడు.

వీటన్నింటి తర్వాత శ్రావణ్ తన ఫేస్‌బుక్ పేజీ నుంచి అన్ని పోస్టులను తొలగించాడు మరియు తన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరుతూ కొత్తగా మరో పోస్ట్ చేశాడు. తాను దర్శకత్వం వహించబోయే సినిమాలో విలన్ క్యారెక్టర్ డైలాగ్స్ రాస్తున్నానని, వాటిని తప్పుగా అర్ధం చేసుకున్నారని శ్రావణ్ చెప్పాడు. తాను పెట్టిన పోస్టులన్నీ తన అభిప్రాయాలు కాదని, ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమాపణలు కోరుతున్నట్లు ఆయన అన్నారు. ఇలా ఆయన పెట్టిన పోస్టులన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ పోస్టులను గాయని చిన్మయి శ్రీపాద తన ఫేస్ బుక్ పేజీలో పంచుకున్నారు. ఆయనపై తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఇటీవల హైదరాబాద్‌లో డాక్టర్‌పై జరిగిన సామూహిక అత్యాచారం మరియు హత్య దేశంలో పెరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టడానికి ఒక స్థిరమైన పరిష్కారం కోసం తోడ్పడింది. ఇటువంటి సమయంలో.. రేపిస్టులను శిక్షించే చట్టాలను తొలగించాలని చిత్ర దర్శకుడు డానియల్ శ్రావణ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి.

Latest Updates