సెల్ఫీతో ఉద్యోగం పోగొట్టుకున్న పోలీస్ అధికారి

ఒక్క సెల్ఫీ పోలీస్ అధికారి ఉద్యోగానికి ఎసరుపెట్టింది. నిబంధనలకు విరుద్దంగా సెల్ఫీదిగుతావా అంటూ పై అధికారులు అక్షింతలేశారు. విధుల నుంచి తొలగించారు.

ఒడిశా పూరి జిల్లా అలసాహి ప్రాంతంలో హత్య జరిగింది. హత్య కేసులో ప్రధాన నిందితుడు బులు ముండా ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుణ్ని జీపులో స్టేషన్ కు తరలించారు. పనిలోపనిగా స్టేషన్ కు వెళ్లే సమయంలో పోలీస్ అధికారి రాధా మోహన్ బిస్వాల్ ..క్రిమినల్ తో ఓ సెల్ఫీ తీసుకున్నాడు. ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అదికాస్తా జిల్లా ఎస్పీకి చేరడంతో అయన అగ్గిలం మీద గుగ్గిలం అయ్యాడు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సెల్ఫీ దిగడం నేరంగా భావించి ఎస్పీ సదరు అధికారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Latest Updates