టిక్ టాక్ చేసి సస్పెండ్ అయింది

పోలీస్ స్టేషన్ లోనే టిక్ టాక్ చేసిన మహిళా పోలీస్ ను సస్పెండ్ చేశారు. ఈ సంఘటన గుజరాత్‌ లో జరిగింది. మేసానా జిల్లాలోని లంఘ్‌ నాజ్‌ పోలీస్‌ స్టేషన్‌ కు చెందిన అర్పితా చౌదరి అనే మహిళా పోలీసు టిప్‌ టాప్‌ గా రెడీ అయి  పోలీస్‌ స్టేషన్లో టిక్‌టాక్‌ చేసింది. డ్యూటీ పక్కన పెట్టి బాలీవుడ్ సాంగ్ కు చిందులేసింది. అంతటితో ఆగకుండా ఆ వీడియో ఎలా ఉందో చెప్పాలంటూ దాన్ని వాట్సాప్‌ లో షేర్‌ చేసింది. వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారి, చివరికి గుజరాత్‌ పోలీస్‌ ఉన్నతాధికారుల కంట పడింది.

దీంతో ఆమెను విధులను నుంచి సస్పెండ్‌ చేశారు.దీనిపై డిప్యూటీ ఎస్పీ మంజితా వంజారా మాట్లాడుతూ..‘ అర్పితా ఈ నెల 20న పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చి డ్యూటీ చేయకుండా టిక్‌ టాక్‌ చేసింది. డ్యూటీలో ఉన్నప్పుడు యూనిఫాం ధరించలేదు. ఆమె పోలీస్‌ స్టేషన్లో ఈ వీడియోను షూట్ చేసింది. పోలీసులు క్రమశిక్షణతో మెలగాలి. ఆమె రూల్స్ ను బ్రేక్ చేసింది.’ అని తెలిపారు.

 

Latest Updates