రెండున్నర నెలల తర్వాత తెరుచుకున్న కార్బెట్ టైగర్ రిజర్వ్

రిషికేష్: కరోనా వైరస్ వ్యాప్తి భయంతో దేశంలోని ప్రముఖ యానిమల్ సఫారీలు, రిజర్వ్‌లను మూసేసిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా మార్చిలో కార్బెట్‌ టైగర్ రిజర్వ్‌ను క్లోజ్ చేశారు. అయితే పర్యాటకుల కోసం దాదాపు రెండున్నర నెలల తర్వాత బిజ్రానీ, ధేలా, జిరాతోపాటు కార్బెట్‌ టైగర్ రిజర్వ్‌ను శనివారం తెరిచారు. కానీ యానిమల్ సఫారీలకు వాహనాల్లో వెళ్లడానికి అనుమతించే వారి సంఖ్యను మాత్రం ఆరు నుంచి నాలుగుకు తగ్గించారు. సోషల్ డిస్టెన్సింగ్ నియమాలను పాటించడంలో భాగంగా డ్రైవర్‌‌, గైడ్‌తో కలిపి కేవలం నలుగురినే అనుమతిస్తున్నామని కార్బెట్ డిప్యూటీ డైరెక్టర్ కళ్యాణీ నేగి తెలిపారు. మామూలు రోజుల్లో సఫారీకి వెళ్లడానికి పగలు, రాత్రి వేళల్లో కలిపి మొత్తం 60 వెహికిల్స్‌ను అనుమతించే వారు. అలాగే ఆయా వాహనాల్లో ఒక్కో దాంట్లో ఆరుగురు ప్యాసెంజర్స్‌ను పోనిచ్చే వారు. కాగా, వర్షాకాలం కారణంగా ఈ నెల 15 నుంచి మూసి వేయనున్న కారణంగా ధికాలా జోన్‌ను అధికారులు తెరవలేదు.

Latest Updates