రేపటి వరకు ఇటానగర్‌లో కర్ప్యూ

అరుణాచల్‌ ప్రదేశ్‌ ఇటానగర్‌లో కర్య్ఫూను రేపటి వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆరు సామాజిక వర్గాల వారికి శాశ్వత నివాస సర్టిఫికెట్లను అందజేయాలన్న సిఫారసులను వ్యతిరేకిస్తూ అరుణాచల్‌ ప్రజలు నిరసనలకు దిగారు. ఆందోళనకారులు ఆదివారం ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం  చౌనామే ఇంటికి నిప్పుపెట్టారు. వాహనాలను, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. సీఎం పెమా ఖండూ వ్యక్తిగత నివాసంపై దాడి చేసేందుకు యత్నించారు. PRCపై జాయింట్‌ హైపవర్‌ కమిటీ ఇచ్చిన రిపోర్టు చెల్లదని అరుణాచల్‌ ప్రభుత్వం నిర్ణయించిందని, దీనిపై ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించాలని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజూ తెలిపారు.

Latest Updates