కోరమాండల్‌‌కు రూ.110 కోట్ల లాభం

ఎరువుల కంపెనీ కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ కు.. ఈ ఏడాదిమార్చి 31తో ముగిసిన నాలుగో క్వార్టర్‌‌లోరూ.110 కోట్ల లాభం వచ్చింది. గత క్యూ4లో ఇది రూ.90 కోట్లు. మొత్తం ఆదాయం రూ.2,647 కోట్లుగా నమోదయింది. గత క్యూ 4తో పోలిస్తే ఇది తొమ్మిది శాతం ఎక్కువ. ఇక తాజా క్యూ 4లో తరుగుదల,  వడ్డీ,  పన్నులకు ముందున్న లాభం(ఇబిటా) గత క్యూ4తో పోలిస్తే 40శాతం పెరిగి రూ.259 కోట్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.13,262 కోట్లు నమోదయింది. ఎరువులతోపాటు సంబంధిత వ్యాపారాలను మరింత పెంచుకోవడం వల్లే ఈ క్వార్టర్‌‌లో మంచి ఫలితాలు సాధించామని కోరమండల్ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ఎండీ సమీర్‌‌ యల్‌ అన్నారు.

Latest Updates