వేరే వ్యాధులుంటే కరోనాతో జరభద్రం

హైదరాబాద్, వెలుగు: ముసలివారు, దీర్ఘకాలి వ్యాధిగ్రస్తులకు కరోనా డేంజర్ బెల్ మోగిస్తోంది. ఈ వైరస్ తో  చనిపోతున్న ప్రతి వందలో 90 మంది డయాబెటీస్‌, హైపర్‌‌టెన్ష న్‌, కిడ్నీజబ్బు, కేన్సర్‌‌వంటి నాన్‌ కమ్యూనికబుల్ డిసీజ్(ఎన్‌సీడీ) రోగులు, ముసలివారే ఉంటున్నారు. రాష్ట్రంలో సుమారు 22 లక్షల మంది ఎన్‌సీడీ తో బాధపడుతుండగా, 60 ఏండ్లుదా టినవారు 30 లక్షల మంది వరకు ఉన్నరు. వీళ్లంతా డేంజర్‌‌జోన్‌లో ఉన్నట్టేనని, లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చినా బయట తిరగొద్ద ని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కుటుంబ సభ్యులతోనూ ఫిజికల్ డిస్టెన్స్‌ పాటించాలంటున్నారు. చిన్నపిల్లలు, గర్భిణుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

 హైబీపీ పేషెంట్లు 10.3 లక్షలు

ఎన్సీడీ బాధితుల్లో 10.3 లక్షల మంది హైపర్‌‌టెన్ష న్‌, 5.7 లక్షల మంది డయాబెటీస్ పేషెంట్లు ఉన్నారు. లక్షన్నర మంది కేన్సర్ పేషెంట్లు, 2 లక్షల మంది కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నారు. గుండె జబ్బులు, తల సేమియా, ఇతరత్ర జబ్బుల వారు మరో రెండున్నర లక్షల మంది ఉన్నారు. వీళ్లందరికీ నెల రోజులకు సరిపడా మెడిసిన్ ఒకేసారి అందజేయాలని అధికారులను వైద్యారోగ్యశాఖ ఆదేశించిం ది. ప్రతివారం రెగ్యులర్‌‌గా బీపీ, షుగర్ చెక్ చేయాలని క్షేత్రస్థాయి ఆరోగ్య కార్యకర్తలకు సూచించింది.

కరోనా కట్టడికి రెండే మార్గాలు

కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోవాలంటే వ్యాక్సిన్ రావడం లేదా హెర్డ్ ఇమ్యూనిటీ రెండు మార్గాలే ఉన్నాయి. వ్యాక్సిన్ రావడానికి ఇంకో ఐదారు నెలలైనా పట్టే అవకాశముంది. అన్ని నెలలు లాక్‌డౌన్ పొడిగించడం సాధ్యం కాదు. దేశ జనాభాలో 60 శాతం మందికి వైరస్ సోకితేనే హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమవుతుంది. ఈ 60 శాతంలో ముసలివారు, దీరకాల  వ్యాధిగ్రస్తులు ఉండకుండా చూసుకోవడం ఒక్కటే మారమని డాక్టర్లు సూచిస్తున్నారు. ఐఏపీఎ స్‌ఎం కేంద్రానికి ఇచ్చిన నివేదికలోనూ ఈ విషయాన్ని పేర్కొంది.

Latest Updates