లాక్ డౌన్ లో నిండు గర్భిణికి కారు ఇచ్చి సాయం చేసిన సిటీ పోలీస్

సికింద్రాబాద్: ఖాకీ చొక్కా వెనుక త‌ప్పు చేసిన వాళ్ల‌ను క‌ఠినంగా శిక్షించే క‌ర‌కు గుండెలే కాదు.. క‌ష్టంలో ఉన్న వాళ్ల‌ను ర‌క్షించే మంచి మ‌న‌సు కూడా దాగి ఉంద‌ని మ‌రోసారి చాటారు మ‌న సిటీ పోలీసులు. క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన లాక్ డౌన్ డ్యూటీలో పోలీసులు కుటుంబాన్ని విడిచి.. ప‌గ‌లు రాత్రి అనే తేడా లేకుండా ప్ర‌జ‌ల కోసం శ్ర‌మిస్తున్నారు. కంటికి క‌న‌ప‌డ‌ని శ‌త్రువైన వైర‌స్ పై నిర్భ‌యంగా పోరాడుతున్నారు. ఈ క‌ష్ట స‌మ‌యంలో సికింద్రాబాద్ చిలకలగూడ పోలీసులు ఓ గ‌ర్భిణికి సాయం చేసి త‌మ నిండు మ‌న‌సును చాటుకున్నారు.

వారసిగూడా నుంచి చిలకలగూడా పోలీస్ స్టేషన్ వైపు వస్తున్న ఇన్ స్పెక్టర్ కారుకు  ఒక మహిళ అడ్డువచ్చింది. అది చూసిన ఇన్ స్పెక్టర్ బాల‌గంగిరెడ్డి వాహనాన్ని అపి ఏమైందని అడిగారు. ఆ మహిళ తన కోడలు పురిటి నొప్పులతో బాధ పడుతోందని ఆస్ప‌త్రికి తీసుకెళ్లేందుకు ఏ వాహ‌నం దొర‌క‌డం లేద‌ని కంట‌త‌డి పెట్టుకుంది. ఆ మ‌హిళ ఆవేద‌న విన్న ఆయ‌న వెంట‌నే వాహ‌నంలో నుంచి దిగి.. ఆ గ‌ర్భ‌వ‌తిని అందులో ఎక్కించారు. కారులో ఆమెను ఆస్ప‌త్రిలో దించి రావాల‌ని డ్రైవర్ ను ఆదేశించారు ఇన్ స్పెక్ట‌ర్. తాను దిగిపోయి తన కారులోనే ఆ మహిళలను స్ప్రింగ్ ఆస్పత్రికి స‌కాలం చేర్చారు బాల‌గంగిరెడ్డి. ఆప‌ద స‌మ‌యంలో ఆయ‌న స్పందించిన తీరుకు ప్ర‌జ‌లు మెచ్చుకున్నారు. మాన‌వ‌త్వంతో నిండు గ‌ర్భిణికి సాయం చేసినందుకు ఆమె కుటుంబ‌స‌భ్యులు కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు.

secunderabad police gives his vehicle to send a pregnant lady to the hospital

Latest Updates