కరోనా ఎఫెక్ట్: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా.. అయితే మీరు చిక్కుల్లో పడ్డట్లే..

వర్క్ ఫ్రమ్ హోమ్.. చేయడానికి ఫ్లెక్సిబుల్‌‌గా ఉన్నా.. ఇందులో కొన్ని చిక్కులు కూడా ఉంటాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇంట్లో కూర్చొని పని చేయడం వల్ల ఈజీగా బరువు పెరిగే అవకాశం ఉందట. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు ఆరోగ్యాన్ని కూడా కాస్త కనిపెట్టుకుని ఉండాలి.

వర్క్ ఫ్రమ్ హోమ్‌‌లో కొన్ని బెనిఫిట్స్‌‌తో పాటు అంతకంటే ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి. ఆఫీస్ చైర్‌‌‌‌లో కూర్చుని పనిచేయడానికి..  లివింగ్ రూంలో ఫ్యామిలీ మెంబర్స్‌‌తో పాటు ఉంటూ పని చేయడానికి చాలా తేడా ఉంటుంది. అన్నింటిని సరిగ్గా మేనేజ్ చేసుకుంటేనే ఆరోగ్యంతో పాటు. వర్క్ కూడా మెరుగ్గా ఉంటుంది.

బరువుతో జాగ్రత్త

మనలో చాలామంది ఈజీగా బరువు పెరుగుతారు. అలాంటి వాళ్లంతా రోజంతా ఏదో  పని చేస్తూ ఉండడం వల్ల ఫిట్‌‌నెస్ కొంతవరకూ కంట్రోల్‌‌లోఉంటుంది.  అయితే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల శరీరానికి తగినంత శ్రమ ఉండదు. ఇంట్లోనే ఎక్కువ సేపు గడుపుతాం కాబట్టి శరీరానికి యాక్టివిటీ తగ్గి ఫిట్‌‌నెస్ కోల్పోయే ప్రమాదముంది. అందుకే నిద్ర, న్యూట్రిషన్, ఫిట్‌‌నెస్ యాక్టివిటీస్.. ఈ మూడింటిని కాస్త కనిపెట్టుకుని ఉండాలి.

తింటూ పని చేస్తే..

ఇంట్లోనే కదా ఉండేది అని కొంతమంది ఎక్కువగా తినేస్తుంటారు. పని చేసేటప్పుడు కూడా నచ్చిన స్నాక్స్ పక్కనపెట్టుకుని లాగిస్తుంటారు. పని చేస్తూ తినడం వల్ల తెలియకుండానే ఎక్కువ తింటారు. దానివల్ల  శరీరంలోకి అదనపు క్యాలరీలు చేరతాయి. తగినంత శారీరక శ్రమ లేకపోతే.. ఆ క్యాలరీలన్ని ఫ్యాట్‌‌గా మారే ప్రమాదముంది. అందుకే తింటూ వర్క్ చేసే అలవాటును మానుకుంటే మంచిది.  ఒకవేళ తినాలనుకుంటే ఫ్రూట్స్, ఓట్స్ లాంటివి తింటే మంచిది.

కూర్చొని చేసేలా..

ఇంట్లో ఉండి వర్క్ చేసేటప్పుడు కొంతమంది ల్యాప్ టాప్ ముందు పెట్టుకుని సోఫాలోనో, మంచం మీదో వాలిపోతుంటారు. అలా చేయడం వల్ల శరీరం వెంటనే రిలాక్స్ అవుతుంది. దాంతో కొన్ని సార్లు నిద్ర కూడా ముంచుకొస్తుంది. అందుకే యాక్టివ్‌‌గా ఉంటూ వర్క్ చేయాలంటే ఆఫీసులో మాదిరిగానే కుర్చీలో లేదా కంప్యూటర్ టేబుల్ ముందు కూర్చుని పని చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంతో పాటు వర్క్ ప్రొడక్టివిటీ కూడా మెరుగవుతుంది.

ఫిట్‌‌నెస్ బ్రేక్స్ ఇవ్వాలి

ఇంట్లో ఉంటూ పని చేసేటప్పుడు ఎప్పుడూ కూర్చునే ఉండకుండా మధ్యలో ఫిట్‌‌నెస్ బ్రేక్స్ ఇస్తుండాలి. అంటే మధ్యమధ్యలో శరీరానికి ఏదైనా యాక్టివిటీ ఇస్తుండాలి.  వర్క్ మధ్యలో కాఫీ బ్రేక్ తీసుకుని అటు ఇటు నడుస్తుండాలి. అలాగే వర్కవుట్స్ కోసం రోజూ ఉదయం లేదా సాయంత్రం కొంత టైం కేటాయించుకుని కొత్తకొత్త వర్కవుట్లు చేసేలా ప్లాన్ చేసుకోవాలి. దాంతోపాటు ఎప్పుడూ ఇంట్లోనే కూర్చోకుండా  గార్డెన్ లేదా ఆరుబయట  కాసేపు నడవడం వల్ల శరీరంతో పాటు మనసు కూడా రిలాక్స్ అవుతుంది.

డెడికేటెడ్ ప్లేస్‌‌లో..

వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సాగాలంటే… ఆఫీస్‌‌లో ఉన్నట్టే ఇంట్లో కూడా వర్కింగ్ అవర్స్‌‌ను సెట్ చేసుకోవాలి. ఆ టైంలో ఎవరినీ దగ్గరకు రావొద్దని చెప్పాలి.  ముఖ్యంగా పిల్లలు, పెట్స్ పనిని డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిద్ర పోయే టైమింగ్స్ కూడా ఎప్పటి లాగానే ఉండాలి. వాటిలో మార్పులొస్తే.. డైలీ రొటీన్ అంతా మారిపోతుంది. అది వర్క్‌‌కు ఇబ్బంది కలిగించొచ్చు. అలాగే వర్క్ కోసం డెడికేటెడ్‌‌గా ఒక ప్లేస్‌‌ను ఏర్పరచుకోవాలి. అలా చేస్తే.. ఆ ప్లేస్‌‌కు వెళ్లగానే  ఆఫీస్ పనులు తప్ప ఇంకేవీ చేయకుండా ఉండే వీలుంటుంది.

అన్నింటికంటే ముఖ్యంగా ఇంట్లో ఉండి ఎందుకు పని చేస్తున్నామో గుర్తుంచుకోవాలి. ఒక పక్క పని చేస్తూనే మరో పక్క ఆరోగ్యాన్ని కూడా  కాపాడుకోవాలి. టైం టు టైం వర్క్  కంప్లీట్ చేయాలి. ఆఫీస్‌‌లో ఉండి పని చేసినా.. ఇంట్లో ఉండి చేసినా వర్క్ రిజల్ట్ ఒకేలా ఉండాలి.

ఇంట్లో ఉంటూ బరువు పెరగకుండా చూసుకోవాలంటే… ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి.. బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయొద్దు. నీళ్లు తాగడం మర్చిపోవద్దు. మైండ్ ఫుల్‌‌గా తినాలి. డైట్‌‌లో మార్పులు చేసుకోవాలి. వ్యాయామం చేయాలి.

డైట్ మార్చాలి

ఇంట్లో ఉండి వర్క్ చేసేటప్పుడు  డైట్ కూడా కాస్త ఛేంజ్ చేస్తే బెటర్.  ఇంట్లో ఉండేటప్పుడు శరీరానికి శ్రమ ఉండదు. కాబట్టి దానికి తగ్గట్టు డైట్‌‌లో మార్పులు చేసుకోవాలి. ఈజీగా జీర్ణమయ్యే ఆహారాలు, ఫ్రూట్స్, ఆకుకూరలు ఎక్కువగా తింటుండాలి.  ముఖ్యంగా ఇంట్లోఉండేటప్పుడు షుగర్, ఆల్కహాల్, హై ఫ్యాట్ ఫుడ్స్ జోలికి వెళ్లకపోవడమే బెటర్. అప్పుడప్పుడు తినే  శ్నాక్స్ కోసం శెనగలు, పల్లీల లాంటివాటిని తీసుకోవడం మంచిది. అలాగే  ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ప్రతీ అరగంటకొకసారి నీళ్లు తాగడం మర్చిపోకూడదు. దాంతో పాటు వారానికొకసారి బరువు చెక్ చేసుకోవడం కూడా ముఖ్యమే.

For More News..

అమెజాన్‌లో కరోనా వైరస్ టెస్టింగ్ కిట్లు!

కరోనా నివారణకు రూ. రెండు కోట్ల విరాళం

Latest Updates