‘మీ వల్లే కరోనా వచ్చింది’.. అంటూ రెండు వర్గాల మధ్య ఘర్షణ

ఇళ్లలోకి వెళ్లి మరీ కొట్టుకున్నారు

ఖమ్మం జిల్లా చింతకాని మండలం నరసింహపురం గ్రామంలో ఘటన

ఖమ్మం జిల్లా: మీ వల్లే గ్రామంలో కరోనా వచ్చిందంటూ.. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మా ఇంటికొచ్చి కొడతారా.. అంటూ..  ప్రతీకారం తీర్చుకున్నారు. పరస్పరం ఇళ్లలోకి వెళ్లి మరీ దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇరు వర్గాల వారికి స్వల్పంగా గాయాలు అయ్యాయి.  ఇరు వర్గాల వారు చింతకాని పోలీస్ స్టేషన్ కు వెళ్లి పరస్పరం పిర్యాదులు చేసుకున్నారు. రెండు కులాలకు చెందిన ఇద్దరి మధ్య మొదలైన వాగ్వాదం.. చిలికి చిలికి ఘర్షణకు దారితీసింది. వివరాల్లోికి వెళితే…

కరోనాతో ఓ వ్యక్తి మృతి చెందగా నిన్న ఖర్మ కార్యక్రమం జరిగింది. అక్కడికి మరో కులం వ్యక్తి వెళ్లాడు. కరోనా వచ్చిన వ్యక్తి బయటకు ఎందుకు వచ్చావు అని కోపంగా అనడం వాగ్వాదానికి దారితీసింది. మీ వల్లే గ్రామంలో కరోనా వచ్చిందంటే.. కాదు.. మీ వారి వల్లే వచ్చిందని ఇద్దరి మధ్య మొదలైన వాగ్వాదం కాస్తా.. కోపంతో మందిని కూడగట్టుకుని ఇంటిపైకి వెల్లి దాడి చేయడంతో.. చిలికి చిలికి గాలి వానలా ఘర్షణకు దారి తీసింది.  వీధుల్లోకి ఈడ్చుకుని వచ్చి కొట్టుకున్నారు.  గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో శాంతించారు.   పోలీసులు రెండు వర్గాలకు చెందిన వారి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates