కరోనా తెచ్చింది మనకు  మస్తు అవకాశాలు

గ్లోబల్ సప్లయ్ చైన్లలోకి చొచ్చుకుపోవాలి

స్వయంగా ఎదగడం అంటే ఐసోలేషన్ అవడం కాదు..

ఏ రంగాల్లో స్ట్రాంగో వాటిలో మరింత ఎదగాలి

ఇండియాలో ప్రొడక్షన్ పెంచాలి

 ఇనొవేషన్ డెస్టినేషన్‌‌గా ఇండియా ప్రమోట్ అవ్వాలి

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఇండియా ముందు మస్తు అవకాశాలను ఉంచింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలకు టాప్ బిల్లింగ్ ఇస్తున్న హెల్త్ సెక్యూరిటీ, సంబంధిత సప్లయి చెయిన్లలో ఉన్న అవకాశాలను ఇండియా తప్పనిసరిగా అందిపుచ్చుకోవాలని ఫారిన్ సెక్రటరీ హర్ష వర్థన్ ష్రింగ్లా చెప్పారు. ఇవి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన ఆత్మ నిర్భర్‌‌‌‌ భారత్‌‌‌‌కు అనుగుణంగానే ఉన్నాయని అన్నారు. ఇండియాను ఆల్టర్నేటివ్ మాన్యుఫాక్చరింగ్ దేశంగా, ఇనొవేషన్ డెస్టినేషన్‌‌‌‌గా విదేశీ మంత్రిత్వ శాఖ ప్రమోట్ చేస్తున్నట్టు ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ప్రోగ్రామ్‌‌‌‌లో ష్రింగ్లా చెప్పారు. చాలా దేశాలు తమ ప్రొడక్షన్ ప్లాంట్లను చైనా వెలుపల ఏర్పాటు చేయాలని కసరత్తు మొదలు పెట్టిన తరుణంలో ష్రింగ్లా ఈ కామెంట్లు చేశారు. చైనాలోని వుహాన్‌‌‌‌లో పుట్టిన కరోనా వైరస్‌‌‌‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కకావికలం అవుతున్నాయి. చాలా దేశాలు తమ మాన్యుఫాక్చరింగ్‌‌‌‌ ఫెసిలిటీస్‌‌‌‌ను చైనా వెలుపలకు తరలిస్తున్నాయి.

కరోనా మహమ్మారితో ఎన్నడూ లేనంతగా హెల్త్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌లో అవకాశాలు పెరిగాయి. ఈ అవకాశాలను ఇండియా అందిపుచ్చుకోవాలని ఫారిన్ సెక్రటరీ అన్నారు. కరోనా మహమ్మారితో చైనాకు, అమెరికాకు మధ్యనున్న ట్రేడ్ సంబంధాలు తెగిపోతున్నాయి. ఈ వైరస్‌‌‌‌కు బాధ్యత చైనానే తీసుకోవాలని అమెరికా పట్టుబడుతోంది. చైనాలో ఉన్న కొన్ని కంపెనీలకు అక్కడ ప్రొడక్షన్ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగాయి. ‘మేము జరిపిన ప్రిలిమినరీ అసెస్‌‌‌‌మెంట్‌‌‌‌లో  ఏ రంగాల్లో అయితే మనం బలంగా ఉన్నామో వాటిల్లో మన గ్లోబల్ వాల్యూ చెయిన్ల ఉనికిని పెంచాలి. టెక్స్ ‌‌‌టైల్స్, అపారెల్స్, జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ, కెమికల్స్‌‌‌‌లో ప్రొడక్షన్‌‌‌‌ను పెంచాల్సినవసరం ఉంది. వీటికి ఇండియాతోపాటు, గ్లోబల్‌‌‌‌గానూ మస్తు డిమాండ్ ఉంటుంది’ అని ష్రింగ్లా చెప్పారు. గ్లోబల్ సప్లయి చెయిన్స్‌‌‌‌లోకి ఎంటర్ కావడానికి అవసరమైన రోడ్‌‌‌‌ మ్యాప్‌‌‌‌ను కూడా ఇండియన్ ఇండస్ట్రీ కోసం ప్రభుత్వం తయారు చేసినట్టు తెలిపారు. మీడియం, లాంగ్ టర్మ్‌‌‌‌లో ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్, డిజైన్ అవుట్‌‌‌‌సోర్సింగ్ వంటి రంగాల్లోని సప్లయి చెయిన్స్‌‌‌‌లోకి మనం వెళ్లాల్సి ఉందని సూచించారు. ఈ రంగాల్లో మనం ఉన్నప్పటికీ, ఈ రంగాల్లో మన సత్తాను మరింతగా చాటాల్సి ఉందని చెప్పారు. హై వాల్యు యాడెడ్ యాక్టివిటీస్‌‌‌‌ను టార్గెట్‌‌‌‌గా పెట్టుకోవడంతో పాటు, బేసిక్ మాన్యుఫాక్చరింగ్‌‌‌‌లో ఆధిపత్యాన్ని కొనసాగించాలన్నారు.

స్వయంగా ఎదగడం అంటే ఐసోలేషన్ అవడం కాదు..

ఇండస్ట్రీస్‌‌‌‌లో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీలను, టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై మనం పనిచేయాలని ష్రింగ్లా సూచించారు. స్వయంగా ఎదగడం అంటే.. ఎకనమిక్‌‌‌‌గా ఐసోలేషన్ అవడం కాదని, గ్లోబల్ సప్లయి చెయిన్లలో కీలకమైన భాగస్వామిగా ఇండియా ఎదగడమేనని ఫారిన్ సెక్రటరీ చెప్పారు. ఏ ప్రొడక్ట్‌‌‌‌లలో, కమోడిటీస్‌‌‌‌లో ఇండియా తన ప్రొడక్షన్‌‌‌‌ను పెంచుకోగలదో ఆ రంగాలను గుర్తించడం అత్యంత కీలకమని ష్రింగ్లా అన్నారు. స్థానికంగా ప్రొడక్షన్‌‌‌‌ను పెంచి, గ్లోబల్‌‌‌‌గా వీటి సప్లయి పెంచాలని సూచించారు. ‘ఆత్మ నిర్భర్ భారత్‌‌‌‌ అంటే ఇండియా  ఎకనమిక్‌‌‌‌గా ఐసోలేట్‌‌‌‌ అవడమేనని చాలా మందిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయని లండన్‌‌‌‌కు చెందిన కింగ్ కాలేజీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రొఫెసర్ హర్ష పంత్ అన్నారు. ఇప్పటిదాకా ఇండియా చెప్పేదేమిటంటే, గ్లోబలైజేషన్‌‌‌‌  ఫ్రేమ్‌‌‌‌వర్క్‌‌‌‌ను సమీక్షిస్తామని, సౌకర్యవంతంగా ఉండే దేశాలతో ఇంటిగ్రేట్ అవుతామని, చైనా లాంటి సౌకర్యవంతంగా లేని దేశాలతో తెగదెంపులు చేసుకుంటామని స్పష్టం చేస్తోందని పంత్ చెప్పారు.

లాంగ్ టర్మ్ ‌‌‌లో ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్, డిజైన్ అవుట్‌‌‌‌సోర్సింగ్ వంటి రంగా ల్లోని సప్లయి చెయిన్స్‌‌‌లోకి మనం వెళ్లాల్సి ఉందని సూచించారు. ఈ రంగాల్లో మనం ఉన్నప్పటికీ, ఈ రంగాల్లోమన సత్తాను మరింతగా చాటాల్సి ఉందని చెప్పారు. హై వాల్యుయాడెడ్ యాక్టివిటీక్టిస్‌‌‌‌ను టార్గె ట్‌‌‌‌గా పెట్టుకోవడంతో పాటు, బేసిక్ మాన్యుఫాక్చరిం గ్‌‌‌‌లో ఆధిపత్యాన్ని కొనసాగించాలన్నారు.

 

Latest Updates