కరోనాను ఆపాల్సింది మనమే..ముందు జాగ్రత్తలే మనకు రక్ష

  • అవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడమే బెటర్​
  • మాస్క్​, ఫిజికల్​ డిస్టెన్స్​ ఇక మరింత అవసరం
  • వ్యక్తిగత శుభ్రతే కాదు.. పరిసరాల శుభ్రత కూడా తప్పనిసరి

లాక్​డౌన్​ 1, 2, 3, 4.. అంతగా సక్సెస్​ను ఇవ్వలేకపోయాయి. వేల కేసులు లక్షలయ్యాయి. పదుల్లో ఉన్న మరణాలు వేలయ్యాయి. ఏం చేసినా కరోనా ఇప్పట్లో కంట్రోల్​ కాదనేది తేలిపోయింది. అందుకే అన్​లాక్​ చేసే పరిస్థితి లేకపోయినా.. సర్కార్​ డేర్​ చేసింది. అన్నింటినీ ఓపెన్​ చేస్తోంది. ఇక నుంచి ఆ కరోనాను ఆపాల్సింది మనమే. మహమ్మారికి మందు లేదన్నది.. వ్యాక్సిన్​ ఇప్పట్లో రాదన్నదీ క్లియర్​. మనం చేయగలిగిందల్లా అది మనకు సోకకుండా చూసుకోవడమే. ఇవ్వాళ్టి నుంచి గుళ్లు, షాపింగ్​మాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకుంటు న్నాయి. ఎప్పుడు.. ఎక్కడి నుంచి.. ఎట్లా ఆ వైరస్​ సోకుతుందో తెలియదు. అందుకే మనందరికీ ఇదో చాలెంజ్​. ఈ పోరాటంలో మనకు సాయంగా ఉండేవి ముందు జాగ్రత్తలే. ఎవరికివారు తమను తాము కాపాడుకోవాలి.

సెంట్రల్​డెస్క్ ​/ హైదరాబాద్​, వెలుగులాక్​డౌన్​ ఎత్తేయడంతో అన్నీ ఓపెన్​ అయ్యాయి. ఆఫీసులు, షాపులు తెరుచుకున్నాయి. బిజినెస్​లు నడుస్తున్నాయి. బస్సులు తిరుగుతున్నాయి. ఇన్నాళ్లూ ఖాళీగా ఉన్న రోడ్లపై ట్రాఫిక్​ పెరిగింది. మనమూ బయటకు పోతున్నాం.. వస్తున్నాం. ఇలాంటి టైంలో కరోనా బారిన పడే ముప్పు ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి బయటి నుంచి ఇంటికి వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మనం ఎఫెక్ట్​ అయితే ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్​ అయ్యే అవకాశాలుంటాయి. మన పక్కవాళ్లకూ డేంజర్​ కావొచ్చు. కాబట్టి మరింత జాగ్రత్తలు అవసరం. ఇంట్లో పిల్లలు ఉంటే బయటి నుంచి వచ్చిన వెంటనే స్నానం చేశాకే వాళ్ల దగ్గరకు వెళ్లాలి. ఇంటిని, పరిసరాలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. జ్వరం, దగ్గు, జలుబు వంటివి ఉంటే ఫ్యామిలీకి దూరంగా ఉండాలి. తగ్గిపోయేదాకా డిస్టెన్స్​ పాటించాలి. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, జర్నీలను మానుకుంటే మంచిది. తప్పనిసరి అయితేనే వెళ్లాలి. వెళ్లినా జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఫిజికల్​ డిస్టెన్స్​ పాటించాలి. అందరికీ దూరంగా ఉంటే ఎవరైనా ఏమైనా  అనుకుంటారేమోనన్న బెంగగానీ, బెరుకుగానీ అవసరం లేదు. ఇలాంటి టైంలో అలాంటి వాటిని పట్టించుకోవద్దు. మనం బాగుంటేనే ఎదుటోళ్లూ బాగుంటారు.. ఎదుటోళ్లు బాగుంటేనే మనమూ బాగుంటామన్న ఆలోచనతోనే ముందుకు పోవాలి. ప్రస్తుతం దేశంలో చాలా కేసుల్లో లక్షణాలు కనిపించట్లేదు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పింది. కాబట్టి ఎవరికి వైరస్​ ఉంటుందో తెలియని పరిస్థితి. ఇలాంటి టైంలో జాగ్రత్తలే మనకు కొండంత రక్ష.

కరోనా మొదట్లో చాలా మంది భయపడినా.. ఇప్పుడు ఆ భయం పోయింది. చాలా మంది లైట్​ తీస్కుంటున్నారు. చాలా వరకు మాస్కులు వాడుతున్నా ఫిజికల్​ డిస్టెన్సే చాలా మంది పాటించట్లేదు. దాని వల్ల ఎవరికి ఎప్పుడు ఎట్ల వైరస్​ అంటుకునేది తెలియనంత పరిస్థితి ఉంది. అన్నీ ఓపెన్​ అవుతున్న టైంలో నిర్లక్ష్యంగా ఉంటే వైరస్​ బారిన పడక తప్పదని ఎక్స్​పర్ట్​లు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రాల్లో ప్రస్తుతం కేసులు వేలల్లోనే ఉంది. ఒకవేళ అదే లక్షల్లోకి వెళితే దవాఖాన్లలో బెడ్డు కూడా దొరకని పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. మన రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖాన్లలో ప్రస్తుతం ఉన్నవి 29 వేల బెడ్లే. ఇందులోనూ కరోనా ట్రీట్​మెంట్​కు పనికొచ్చేవి సగం కూడా లేవు. దీంతో ప్రైవేటు హాస్పిటల్స్​ఫై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ప్రైవేట్​లో అడ్డగోలుగా బిల్లులు వేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ట్రీట్​మెంట్​ అందకపోతే ప్రైవేట్​ ఆస్పత్రులకు డిమాండ్​ పెరుగుతుందనడంలో అనుమానం లేదు. వైరస్​ ఒక్కసారిగా విజృంభిస్తే పరిస్థితి ఎట్లా ఉంటదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కరోనా వంటి కనిపించని శత్రువును ఓడించాలంటే ఆ వైరస్​పైన అవగాహన కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

కేసులు పీక్స్​కు వెళుతున్నయ్​

ఓ విషయం గమనించారో లేదో గానీ.. లాక్​డౌన్​లో కన్నా అన్​లాక్​లోనే కేసులు ఎక్కువైపోతున్నాయి. ఐదో లాక్​డౌన్​ ప్రకటించినా అది పేరుకే. ఇప్పుడంతా ఓపెనే. ఈ టైంలోనే కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అప్పటి నుంచి ఏరోజూ 8 వేలకు తక్కువగా కేసులు నమోదు కాలేదు. శనివారం ఫస్ట్​ టైం పది వేల కేసుల మార్కు కూడా దాటింది. ఇకపై ఆ కేసులు మరింత పెరిగే ముప్పూ ఉంది. రోజూ 200 మందికిపైగా చనిపోతున్నారు. రాష్ట్రంలోనూ రోజూ 100కుపైగా కేసులొస్తున్నాయి. ఏడెనిమిది మంది చనిపోతున్నారు. కేసులు ఎక్కువగా ఉన్నాయనుకున్న స్పెయిన్​, ఇటలీ, బ్రిటన్​ వంటి దేశాలతో సమానంగా మన దగ్గరా కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ కేసుల్లో మన దేశం కొద్ది రోజులుగా టాప్​5లోనే ఉంటోంది. దేశంలో జనవరి 30న ఫస్ట్​ కేసు నమోదైతే.. లక్ష కేసులకు చేరడానికి 110 రోజులు పట్టింది. అంటే మే 18న ఫస్ట్​ లక్ష కేసులు నమోదయ్యాయి. అక్కడి నుంచి జస్ట్​ రెండు వారాల్లోనే రెండో లక్ష కేసులు రికార్డయ్యాయి. జూన్​2న 2 లక్షల మార్కును దాటాయి. ఇప్పుడు జూన్​ 3 నుంచి జస్ట్​ ఐదు రోజుల్లోనే 50 వేల కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరణాల రేటు తక్కువగానే ఉన్నా.. ఈ మధ్య అవి కూడా పెరుగుతున్నాయి. కాబట్టి లాక్​లు ఓపెన్​ చేస్తున్న ఈ టైంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలన్నది ఈ లెక్కలే చెబుతాయి.

ప్రపంచంలో 70 లక్షలు దాటినయ్​

ప్రపంచంలోనూ కేసులూ 70 లక్షలు దాటిపోయాయి. పదకొండు రోజులుగా లక్షకుపైనే కేసులొస్తున్నాయి. 4 లక్షల మందికిపైగానే బలయ్యారు. ఒకప్పుడు స్పెయిన్​, ఇటలీ, ఫ్రాన్స్​ వంటి దేశాల్లోనే కరోనా తీవ్రత ఎక్కువగా ఉండేది. ఇప్పుడిప్పుడే అక్కడ కేసులు తగ్గుతున్నాయి. కానీ, కరోనా ప్రభావం అంత లేదనుకున్న బ్రెజిల్​, రష్యా వంటి దేశాలు ఇప్పుడు టాప్​5లోకి వచ్చాయి. పెరూ, టర్కీ వంటి మరికొన్ని దేశాల్లోనూ కేసులు ఎక్కువవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకూ కేసుల్లో ఎక్కడో ఉన్న పెరూ.. ఇప్పుడు 8వ స్థానానికి వచ్చింది. అక్కడ 1.91 లక్షల కేసులున్నాయి. 5 వేల మందికిపైగా చనిపోయారు. 1.69 లక్షల కేసులతో టర్కీ 11వ స్థానంలో ఉంది. మన పక్కదేశం పాకిస్థాన్​లోనూ లక్షకు దగ్గర్లో ఉన్నాయి కరోనా కేసులు. 213 దేశాల్లో కరోనా ప్రభావం ఉంటే.. 185 దేశాల్లో కరోనా మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం 50కిపైగా దేశాల్లో రోజూ కనీసం ఒక్క మరణమైనా నమోదవుతోంది. 20 దేశాల్లో 10 మందికిపైగా చనిపోతున్నారు.

ప్రజలదే 90 శాతం బాధ్యత

కరోనా విషయంలో ఇప్పుడు ప్రభుత్వాల బాధ్యత తగ్గి, ప్రజల బాధ్యత పెరిగింది. ఇంతకుముందు 90శాతం ప్రభుత్వాల బాధ్యత ఉంటే, పది శాతం ప్రజల బాధ్యత ఉండేది. ఇప్పుడది రివర్స్​ అయింది. వైరస్​ సోకకుండా ఎవరికి వారే జాగ్రత్తగా ఉండాలి. మాస్క్​, ఫిజికల్​ డిస్టెన్స్​ నిబంధనలు పాటించాలి. వృద్ధులు, చిన్నపిల్లలు వైరస్​కు ఎక్స్​పోజ్​ అవ్వకుండా కాపాడుకోవాలి. ప్రభుత్వాలు టెస్టులు, ట్రీట్​మెంట్​పై ఫోకస్​ పెట్టాలి. ఒకేసారి ఎక్కువ మంది వైరస్ బారిన పడకుండా, టెస్టుల సంఖ్యను పెంచుతూ పాజిటివ్​ వచ్చిన వారిని ఐసోలేట్ చేయాలి. గవర్నమెంట్​ ఆస్పత్రుల్లో బెడ్లు పెంచుకోవాలి. వెంటిలేటర్లు, ఆక్సిజన్​ సప్లై ఉండేలా చూసుకోవాలి. డాక్టర్లు, నర్సింగ్​ స్టాఫ్​ సరిపడా ఉండేలా చూసుకోవాలి.  ప్రైవేటు హాస్పిటల్స్​ను ట్రీట్​మెంట్​లో ఇన్వాల్వ్​ చెయ్యాలి. ట్రీట్​మెంట్​ ఖర్చు తగ్గించే చర్యలు తీసుకోవాలి.

– డాక్టర్​ రంగారెడ్డి బుర్రి, ప్రెసిడెంట్​, ఇన్ఫెక్షన్​ కంట్రోల్​ అకాడమీ ఆఫ్​ ఇండియా

10 పరీక్షలు పెడతారా?వాయిదా వేస్తరా?

 

Latest Updates