హైద‌రాబాద్ లో క‌రోనా కారు

క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు హైద‌రాబాద్ లో ర‌క‌ర‌కాల కార్య‌క్ర‌మాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. పోలీసులు క‌రోనా వైర‌స్ ఆకారంలో ఉన్న హెల్మెట్లు పెట్టుకుని ప్ర‌జ‌లు లాక్ డౌన్ పాటించాలంటూ అవేర్ నెస్ చేశారు. ఇదిలావుంటే ఇప్పుడు క‌రోనా కారు సిటీలో చ‌క్క‌ర్తు కొడుతోంది. క‌రోనా వైర‌స్ ఆకారంలో ఉన్న కారు హైద‌రాబాద్ లో తిరుగుతూ అవేర్ నెస్ చేస్తోంది. కారులో నుంచి మైకులో డ్రైవ‌ర్ మాట్లాడుతూ క‌రోనా జాగ్ర‌త్త‌ల‌ను తెలుపుతున్నాడు.

బ‌హుదూర్ పురాకు చెందిన సుధా కార్స్ మ్యూజియం ఈ కారును త‌యారుచేయ‌గా.. క‌రోనా వైర‌స్ గురించి ఈ కారు ద్వారా ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. సోష‌ల్ డిస్టెన్స్ పాటించాల‌ని.. క‌రోనా జాగ్ర‌త్త‌లు.. వైర‌స్ సోక‌కుండా ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టాలి అనేది ఈ కారు ద్వారా ప్ర‌చారం చేస్తున్నారు. 100 సీసీ ఇంజిన్ తో, కారులో ఒక‌రు కూర్చునేలా కారును త‌యారు చేశారు. గంట‌కు ఈ కారు 40కేఎంపీహెచ్ స్పీడ్ తో ప్ర‌యాణిస్తున్న‌ట్లు తెలిపారు షో రూం నిర్వాహకులు.

Latest Updates