ఏపీలో 5 లక్షలు దాటిన కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,368 కరోనా కేసులు నమోదుకాగా.. వైరస్ తో 70 మంది మృతి చెందారని తెలిపింది ఏపీ వైద్యారోగ్యశాఖ. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో 5,06,493కి కరోనా కేసులు చేరాయని.. ప్రస్తుతం ఏపీలో 97,932 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది.

కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 4,04,074 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 4,487 మంది కరోనాతో మృతి చెందారని చెప్పింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 58,187 కరోనా టెస్టులు చేశారని. ఇప్పటివరకు ఏపీలో 41.66 లక్షల కరోనా టెస్టులు నిర్వహించారని తెలిపింది వైద్యారోగ్యశాఖ. ఇవాళ నమోదైన కేసులతో ఏపీలో 5 లక్షల కరోనా కేసులు దాటాయి.

Latest Updates