ఏపీ కన్నా మన దగ్గరే సీరియస్​

సెంట్రల్​డెస్క్​, వెలుగు: రాష్ట్రంలో ఈ మధ్య కరోనా కేసుల తీవ్రత బాగా పెరిగింది. కొన్ని రోజుల క్రితం వరకు రోజూ రెండుమూడొందల చొప్పున కేసులు నమోదైతే.. రెండు మూడురోజులుగా 800కుపైనే కొత్త కేసులు వస్తున్నాయి. దానికీ కారణం ఉంది. ఈమధ్య రాష్ట్ర ప్రభుత్వం టెస్టుల సంఖ్యను పెంచింది. మునుపటితో పోలిస్తే టెస్టులు ఎక్కువ చేస్తోంది. ఇప్పటికీ పక్క రాష్ట్రాలతో పోలిస్తే తక్కువే అయినా, ఎంతో కొంత మాత్రం టెస్టులను పెంచింది సర్కార్​. దాని వల్లే ఇప్పుడు కేసులు ఎక్కువ వెలుగు చూస్తున్నాయి. తక్కువ టెస్టుల్లో ఎక్కువ కేసులు వచ్చింది మన రాష్ట్రంలోనే. మన పక్క రాష్ట్రం ఏపీ సహా వేరే ఏ ఇతర రాష్ట్రాలతో పోల్చినా మన దగ్గరే ఎక్కువ కేసులు వచ్చాయన్నది మాత్రం అనుమానం లేని విషయం. అంటే పాజిటివ్​ రేటు రాష్ట్రంలో ఎక్కువగా ఉంది.

ఏపీతో పోలిస్తే 15 రెట్లు ఎక్కువ

ఏపీతో పోలిస్తే మన దగ్గర కరోనా కేసుల పాజిటివ్​ రేటు 15 శాతం ఎక్కువగా ఉంది. ఏపీలో రోజూ వేలాది టెస్టులు చేస్తున్నారు. బుధవారం రికార్డ్​స్థాయిలో 36,047 టెస్టులు చేసింది అక్కడి సర్కార్​. అందులో పాజిటివ్​ వచ్చింది 497 మందికే. అంటే కేవలం 1.37 శాతం మందికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది. అంటే పాజిటివ్​ రేటు తక్కువగా ఉంది. ఇప్పటిదాకా మొత్తం 7 లక్షల 69 వేల 319 టెస్టులు చేసింది. అందులో మొత్తం 10,884 మందికి కరోనా పాజిటివ్​ వచ్చింది. అంటే ఓవరాల్​ పాజిటివ్​ రేటు జస్ట్​ 1.4 శాతం. అయినా సరే ఇంటింటికీ టెస్టులు చేసేందుకు సిద్ధమవుతోంది అక్కడి సర్కార్​. కానీ, మన రాష్ట్రంలో మాత్రం సీన్​ పూర్తి రివర్స్​. రోజూ జస్ట్​4 వేలకుపైన మాత్రమే టెస్టులు చేస్తోంది సర్కార్​. అది కూడా ఈ మధ్యే పెంచింది. బుధవారం 4,069 టెస్టులు చేస్తే.. 891 మందికి పాజిటివ్​ వచ్చింది. అంటే దాదాపు 21.9 శాతం మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. టెస్టులు ఎక్కువ చేయాలన్న ఒత్తిళ్ల మేరకు ఈ మధ్య 50 వేల టెస్టులు చేస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. అందులో భాగంగా ఈ నెల 16 నుంచి 36 వేల శాంపిళ్లను తీసుకున్నారు. మొత్తంగా ఇప్పటిదాకా రాష్ట్రంలో చేసిన టెస్టులు 67,618. అందులో 10,444 మందికి పాజిటివ్​ ఉన్నట్టు తేలింది. అంటే పాజిటివ్​ రేటు 15.4 శాతంగా ఉంది. ఈ లెక్కన ఏపీతో పోలిస్తే మన రాష్ట్రంలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిపోతుంది.

వేరే ఏ రాష్ట్రంతో పోల్చినా అంతే..

మహారాష్ట్ర (17.29%), ఢిల్లీ (16.7%)ని పక్కనపెడితే వేరే ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా మన రాష్ట్రంలోనే కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉందన్న విషయం స్పష్టమవుతోంది. పెద్ద రాష్ట్రాలైన గుజరాత్​(8.5%), ఉత్తర్​ప్రదేశ్​(3.2%), రాజస్థాన్​(2.16%), మధ్యప్రదేశ్​(3.95%)లలో పాజిటివ్​ రేటు తక్కువగానే ఉంది. అక్కడ లక్షల్లో టెస్టులు చేశారు. చిన్న రాష్ట్రాల్లోనూ పాజిటివ్​ రేటు మనకన్నా తక్కువగా ఉంది. పొరుగు రాష్ట్రం తమిళనాడులో కేసులు మనకన్నా ఎక్కువగానే ఉన్నా.. పాజిటివ్​ రేటు విషయంలో మాత్రం మనకన్నా ఆ రాష్ట్రమే మెరుగ్గా ఉంది. అక్కడ బుధవారం నాటికి 9,76,431 టెస్టులు చేస్తే.. 67,468 కేసులు నమోదయ్యాయి. పాజిటివ్​ రేటు 6.9% మాత్రమే. ఇటు కర్నాటకలోనూ పాజిటివ్​1.8 శాతం మాత్రమే ఉంది. అక్కడ 5,39,247 టెస్టులకు 10,118 మందికి పాజిటివ్​ వచ్చింది.

కరోనా వైరస్ బందాలను తెంచుతోంది

 

 

Latest Updates