దేశంలో 75 లక్షలకు చేరువైన కరోనా కేసులు

దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 61,871 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 74,94,552 కు చేరాయి. నిన్న ఒక్కరోజులో 1033 మంది చనిపోవడంతో కోవిడ్ మరణాల సంఖ్య 114031 కు చేరింది. నిన్న ఒక్కరోజే 72,615  మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశంలో  కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 65,97,210 కు చేరింది. ఇంకా 7,83,311 మంది ఆస్పత్రిలో ఉన్నారు. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 9,70,173 కరోనా టెస్టులు చేశారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో 9కోట్ల42 లక్షల24 వేల190 కరోనా టెస్టులు చేశారని ఐసీఎంఆర్ ప్రకటించింది.

Latest Updates