దేశంలో 92 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో  కొత్తగా 44 వేల 376 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 92 లక్షల 22వేల 217 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 481 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య లక్షా 34 వేల 699 కు చేరింది. నిన్న మరో 37 వేల 816 కోలుకోగా.. ఇప్పటి వరకూ 86 లక్షల 42 వేల 771మంది కరోనా నుంచి కోలుకున్నారు.  4 లక్షల 44 వేల 746 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా 11 లక్షల 59 వేల 32 టెస్టులు చేయగా..ఇప్పటి వరకూ దేశంలో 13 కోట్ల 48 లక్షల 41 వేల 307 మంది శాంపిల్స్ పరీక్షించారు.

 

 

 

Latest Updates