దేశంలో కేసులు 78 లక్షలు.. రికవరీ 70 లక్షలు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా 50 వేల కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 53370 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా ..మరో 650 మంది చనిపోయారు. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మొత్తం 78,14,682 కు చేరగా..మృతుల సంఖ్య1,17,956 కు చేరింది. నిన్న ఒక్కరోజే 67,549 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీ సంఖ్య 70,16,046  చేరింది. ఇంకా 680680 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే 12,69,479 మందికి టెస్టులు చేయడంతో దేశంలో అక్టోబర్ 23 నాటికి కరోనా టెస్టుల సంఖ్య మొత్తం 10 కోట్ల13 లక్షల 82 వేల 564 కు చేరింది.

మంత్రి, కార్పొరేటర్ ముందే కొట్టుకున్న టీఆర్ఎస్, బీజేపీ నేతలు

 

Latest Updates