దేశంలో 15 లక్షల మార్క్ దాటిన కరోనా కేసులు

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,77,43,740 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. మంగళవారం 4,08,855 శాంపిళ్లు పరీక్ష చేసినట్లుగా ఐసీఎంఆర్ ట్వీట్ చేసింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 48,512 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,83,157కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు తెలిపింది. ప్రస్తుతం దేశంలో 4,96, 988 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కరోనా బారినపడి 9,52,744 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో కరోనా బారినపడి 768 మంది మరణించారు. దాంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 34,193కు చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదయిన కరోనా కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది.

For More News..

విద్యార్థుల ఆన్‌లైన్ క్లాసుల కోసం ఫ్రీగా స్మార్ట్‌ఫోన్లు

మలేషియా మాజీ ప్రధానికి 12 ఏండ్ల జైలుశిక్ష

ఈటల మీటింగ్లో కరోనా కలకలం

Latest Updates