దేశంలో 25 వేల‌కు చేరువ‌లో క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1,490 కేసులు, 56 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా శ‌నివారం సాయంత్రం ఐదు గంట‌ల స‌మ‌యానికి క‌రోనా కేసుల సంఖ్య 24,942కు చేరిన‌ట్లు తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ‌. అందులో 779 మంది మ‌ర‌ణించ‌గా.. 5210 మంది డిశ్చార్జ్ అయ్యారని ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం 18,953 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని చెప్పింది.

దేశంలో అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో 6817 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 301 మంది మ‌ర‌ణించారు. గుజ‌రాత్ లో 2815 మంది, ఢిల్లీలో 2514 మంది ఈ వైర‌స్ బారిన‌ప‌డ్డారు. రాజ‌స్థాన్ లో 2034, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో 1952, యూపీలో 1778, త‌మిళ‌నాడులో 1755 క‌రోనా కేసుల న‌మోద‌య్యాయి. ఏపీలో 1061 మందికి, తెలంగాణ‌లో 984 మందికి వైర‌స్ సోకింది. గోవాలో ఏడు, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో ఒక‌టి, మ‌ణిపూర్ లో రెండు క‌రోనా కేసులు న‌మోదు కాగా, ఇప్ప‌టికే అంద‌రూ పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మూడు రాష్ట్రాలో దేశంలో క‌రోనా ఫ్రీ స్టేట్స్ గా నిలిచాయి.

Latest Updates