తెలంగాణ‌లో 25 వేలు దాటిన క‌రోనా కేసులు.. 300 పైగా మ‌ర‌ణాలు

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. ప్రతి రోజు భారీ సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 6,383 శాంపిల్స్ ప‌రీక్షించ‌గా.. 1831 మందికి పాజిటివ్ వ‌చ్చింద‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. అలాగే ఈ ఒక్క రోజే 11 మంది క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 25 వేలు దాటిపోగా.. 300 మందికి పైగా ఈ మ‌హమ్మారికి బ‌ల‌య్యారు.

రాష్ట్రంలో తాజాగా న‌మోదైన 1831 కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం క‌రోనా బాధితుల సంఖ్య 25,733కి చేరింది. అలాగే గ‌డిచిన 24 గంట‌ల్లో 11 మంది క‌రోనా పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 306కి పెరిగింది. ఈ ఒక్క రోజులో భారీగా 2078 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాను జ‌యించిన వారి సంఖ్య 14,781కి చేరింది. ప్ర‌స్తుతం 10,646 మంది చికిత్స పొందుతున్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో అత్య‌ధికంగా ‌గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 1419 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. రంగారెడ్డి జిల్లాలో 160 మందికి, మేడ్చ‌ల్‌లో 117 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.

Latest Updates