కంట్రోల్ లోకి క‌రోనా!.. రాష్ట్రంలో కొత్త‌గా రెండు క‌రోనా కేసులు

రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ క్ర‌మంగా కంట్రోల్ లోకి వ‌స్తోంది. కొద్ది రోజులుగా కేసుల సంఖ్య భారీగా త‌గ్గుతోంది. సోమ‌వారం కేవ‌లం రెండు కేసులు మాత్ర‌మే న‌మోద‌య్యాయి. అవి కూడా GHMC ప‌రిధిలోనే వ‌చ్చాయి. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఎక్క‌డా ఒక్క కేసు కూడా రాలేదు. అలాగే ఇవాళ ఒక్క రోజులో 16 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 1003కు చేరింది. అందులో 25 మంది మ‌ర‌ణించ‌గా.. 332 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం 646 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే రెండ్రోజులుగా ఒక్క మ‌ర‌ణం కూడా న‌మోదు కాక‌పోవ‌డం కొంత ఊర‌ట‌నిస్తోంది.

రాష్ట్రంలో అత్య‌ధికంగా GHMC ప‌రిధిలో 556 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. సూర్యాపేట జిల్లాలో 83, నిజామాబాద్ లో 61, గ‌ద్వాల్ లో 45, వికారాబాద్ జిల్లాలో 37 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. GHMC ప‌రిధిలోకి రాని రంగారెడ్డి జిల్లాలో 31, వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లాలో 27, నిర్మ‌ల్ లో 20, ఆదిలాబాద్ లో 21, క‌రీంన‌గ‌ర్ లో 19 మంది వైర‌స్ బారిన‌ప‌డ్డారు.

Latest Updates