ఒక్క రోజులో 1755 క‌రోనా కేసులు.. 77 మ‌ర‌ణాలు

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 35,365కి చేరింది. అందులో 1152 మంది మ‌ర‌ణించ‌గా.. 9065 మంది పేషెంట్లు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం 25,148 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. శుక్ర‌వారం సాయంత్రం ఐదు గంట‌ల‌కు క‌రోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1755 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపింది. అలాగే ఈ ఒక్క రోజులో 77 మంది ప్రాణాలు కోల్పోయార‌ని చెప్పింది.

ఒక్క మ‌హారాష్ట్ర‌లోనే 10 వేల‌కు పైగా కేసులు

దేశంలో అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో 10498 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అందులో 459 మంది మ‌ర‌ణించ‌గా.. 1773 మంది డిశ్చార్జ్ అయ్యారు. గుజ‌రాత్ లో 4395, ఢిల్లీలో 3515 మందికి వైర‌స్ సోకింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో 2719, రాజ‌స్థాన్ లో 2584, త‌మిళ‌నాడులో 2323, యూపీలో 2281 క‌రోనా కేసులు నమోద‌య్యాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 1463, తెలంగాణ‌లో 1039, ప‌శ్చిమ బెంగాల్ లో 795 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు.

Latest Updates