ఇంకో నెలలో పీక్స్​కు కరోనా

కేసులు విపరీతంగా పెరిగే అవకాశం
పబ్లిక్​ హెల్త్​ డైరెక్టర్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్​ శ్రీనివాసరావు వెల్లడి
జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచన

హైదరాబాద్, వెలుగు: లాక్​డౌన్​ సడలింపులతో వచ్చే నెల రోజుల్లో కరోనా పీక్స్​కు వెళుతుందని, కేసులు విపరీతంగా పెరుగుతాయని పబ్లిక్​ హెల్త్​ డైరెక్టర్​ డాక్టర్​ శ్రీనివాసరావు అన్నారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వృద్ధులు, చిన్నపిల్లలు, ఇతర జబ్బులతో బాధపడే రోగులపై వైరస్​ ప్రభావం ఎక్కువగా ఉంటోందని, వాళ్లంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. శనివారం మెడికల్​ ఎడ్యుకేషన్​ డైరెక్టర్​ డాక్టర్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రమేశ్​రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ర్టంలోని కేసుల్లో ఎక్కువ కేసులు మర్కజ్​ లింకున్నవేనన్నారు. లాక్​డౌన్​ సడలింపులు, వలస కార్మికులు, ఇతర దేశాల నుంచి వచ్చేవారితో వారం రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు.

బర్త్​డేతో 82 మందికి

బోరబండలో ఓ యువకుని ద్వారా 14 మందికి వైరస్​ అంటుకుందని శ్రీనివాసరావు చెప్పారు. వనస్థలిపురంలో ఒక బర్త్​డే పార్టీ ద్వారా 82 మందికి వైరస్​ సోకిందన్నారు. వికారాబాద్ జిల్లాల్లో ఒడి బియ్యం కార్యక్రమం వల్ల ఫ్యామిలీ మొత్తానికి వైరస్ అంటుకుందని చెప్పారు. సర్కార్​ పెట్టిన రూల్స్​ పాటించి ఉంటే కేసుల తీవ్రత తక్కువగానే ఉండేదన్నారు. కరోనాతో పాటు సీజనల్​ వ్యాధులపైనా దృష్టి పెడుతున్నామన్నారు. ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి వారం వారం మందులు, ట్రీట్​మెంట్​ వివరాలను స్వయంగా పరిశీలిస్తామన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి లక్షన్నర మంది వలస కార్మికులు తిరిగొచ్చారని, అందులో వెయ్యి మందికి టెస్టులు చేయగా 175 మందికి పాజిటివ్​ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం జిల్లాల్లో 82,313 మంది, మిగిలిన వాళ్లు జీహెచ్​ఎంసీ పరిధిలో హోంక్వారంటైన్​లో ఉన్నారన్నారు. రాష్ర్టంలో ఇప్పటిదాకా 30 వేల మందికి టెస్టులు చేశామన్నారు. గాంధీ హాస్పిటల్​లో 1,500 ఆక్సిజన్​ లైన్స్​ను సిద్ధంగా ఉంచామని మెడికల్​ ఎడ్యుకేషన్​ డైరెక్టర్​ డాక్టర్​ రమేశ్​రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తల కోసం

ఉద్యోగం పోతే ఈఎంఐ రద్దు

11 అంకెల సెల్ ఫోన్ నెంబర్లు రాబోతున్నాయి

కరోనా కన్నా రాక్షసం ఈ మనుషులు..

 

Latest Updates