మేలో పీక్ లెవెల్ కు కరోనా కేసులు

  • తర్వాత క్రమంగా తగ్గుతాయన్న కేంద్ర హోంశాఖ వర్గాలు

న్యూఢిల్లీ: మే మొదటి వారంలో కరోనా కేసులు పీక్ కు చేరుతాయని, తర్వాత క్రమంగా తగ్గుతాయని అంచనాలు ఉన్నట్లు కేంద్ర హోం శాఖ వర్గాలు చెప్పాయి. ముందుగా లాక్ డౌన్ ప్రకటించిన రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగ్గా ఉందన్నాయి. రాజస్థాన్, పంజాబ్, బీహార్ రాష్ట్రాలు ముందుగా లాక్ డౌన్ అమలు చేశాయని.. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రతో పోలిస్తే అక్కడ పరిస్థితి మెరుగ్గా ఉందని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. వచ్చేవారం కీలకమని, టెస్టుల సంఖ్యను పెంచుతామన్నారు. కరోనా లక్షణాలు ఉన్న అందర్నీ టెస్టు చేస్తామని చెప్పారు. టెస్టులు పెరిగే కొద్దీ కేసులు పెరుగుతాయన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగించిన తర్వాత దేశంలో 2,800 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 36 వేల మందిని క్వారంటైన్ చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 3.6 లక్షల మంది క్వారంటైన్ లో ఉన్నట్లు కేంద్ర హోంశాఖ అధికారులు చెప్పారు.

Latest Updates