భారత్ లో 678కి చేరిన కరోనా కేసులు

దేశంలో కరోనా నివారణకు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా… కరోనా వైరస్ కేసులు మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 678 కి చేరిందని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ తెలిపింది. దీని బారిన పడి ఇప్పటి వరకు 13 మంది చనిపోయినట్లు చెప్పింది. ఇందులో అత్యధికంగా మహరాష్ట్రలో 124 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా… కేరళలో ఈ సంఖ్య 118 చేరింది. తెలంగాణలో ఇప్పటివరకు 41 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో 11 కేసులు నిర్ధారణ అయ్యాయి.

జమ్ముకశ్మీర్ లో మొట్టమొదటి  కరోనా మరణం నమోదైంది. హైదర్ పోరా గ్రామంలో కరోనా వైరస్  సోకి  65 ఏళ్ల వ్యక్తి చనిపోయినట్లుగా కశ్మీర్ డాక్టర్లు తెలిపారు. ఆ తర్వాత చనిపోయిన వ్యక్తి కుటుంబంలోని నలుగురు సభ్యులకు కూడా వైరస్  సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

 

Latest Updates