హైదరాబాద్ నిమ్స్ లో వారం రోజులు కరోనా క్లినికల్ ట్రయల్స్ నిలిపివేత

కరోనా వ్యాక్సిన్ తయారీలో పురోగతి సాధించిన భారత్ బయోటెక్ సంస్థ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో క్లినికల్స్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. అయితే హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చేపట్టిన క్లినికల్ ట్రయల్స్ ను వారం పాటు నిలిపివేశారు. వ్యాక్సిన్ ప్రయోగాలకు ముందుకొచ్చే వలంటీర్లకు సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తయ్యాకే క్లినికల్ ట్రయల్స్ చేపట్టాలని నిమ్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే మూడు రోజుల పాటు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్టు తెలుస్తోంది.

ఆగస్టు 15 నాటికి దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకురావాలని కేంద్రం ప్రకటించిన క్రమంలో ఐసీఎంఆర్ అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ కు కోసం దేశంలోని పలు ఆస్పత్రులను ఎంపిక చేసి వాటికి ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఆగస్టు 15 డెడ్ లైన్ ను దృష్టిలో పెట్టుకుని క్లినికల్ ట్రయల్స్ కు ఆస్పత్రులు సహకరించాలంటూ ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.

Latest Updates