త్వరలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా

కరోనాను ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకువచ్చేందుకు చర్చిస్తున్నామని తెలిపారు మంత్రి ఈటల రాజేందర్. ఇదే అంశంపై శాసనమండలిలో ఆయన మాట్లాడారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చే దానిపై త్వరలోనే సానుకూల నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే ఈ అంశంపై డిమాండ్లు వస్తున్నాయని చెప్పారు. ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. అంతేకాదు  కరోనా సోకిందని తెలిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలని..ముదిరితే  చాలా ప్రమాదమని హెచ్చరించారు.

ప్రజలు కరోనా విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నారని, అందుకే ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో కేసులు, మరణాల శాతం తగ్గిందని తెలిపారు మంత్రి ఈటల. వైరస్ సోకిన వ్యక్తుల కోసం వైద్యారోగ్య సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారని తెలిపారు.

Latest Updates