రాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా కలకలం

తూర్పు గోదావరి జిల్లా: రాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా మరోసారి కలకలం రేపింది. తాజాగా 10 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు సెంట్రల్ జైలులో 52 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. సెంట్రల్ జైలులో మొత్తం 1670 ఖైదీలు, 200 మంది సిబ్బంది ఉండగా..  జైలులో ఉన్న 28 మంది ఖైదీలకు, 24 మంది జైలు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న కొంత మంది అనుమానితులకు కరోనా పరక్షలు చేయగా..  10 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంకా 900 మంది పరీక్షల రిపోర్ట్ పెండింగ్ లో ఉండడం గుబులు రేపుతోంది.

            కరోనా పాజిటివ్ సోకిన ఖైదీలకు కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది.  కరోనా సోకిన సిబ్బందిలో కొందరు ఆసుపత్రుల్లో ఉండగా.. మరికొందరు హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జైలులో మూలాఖత్ లను అధికారులు నిలిపివేశారు.

Latest Updates