వరంగల్ సెంట్రల్ జైలులో కరోనా కలకలం

 వరంగల్, వెలుగు: వరంగల్ సెంట్రల్ జైలులో కరోనా కలకలం రేపుతోంది. జైలులో పని చేస్తున్న సిబ్బందితోపాటు వారి కుటుంబ సభ్యులు వైరస్ బారిన పడ్డారు. రెండు రోజుల కిందట సెంట్రల్ జైలులో పనిచేస్తున్న ఓ వార్డర్ కు కరోనా లక్షణాలు కనిపించాయి. జలుబు, జ్వరం రావడంతో అప్రమత్తమైన అధికారులు సిబ్బంది నివాసం ఉంటున్న క్వార్టర్లలో గురువారం కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. దీంతో కొందరు సిబ్బం దితో పాటు వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తం 13 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ మురళీబాబు తెలిపారు. ప్రస్తుతం జైలులో వివిధ కేసుల్లో శిక్ష పడ్డవారు, రిమాండ్ ఖైదీలు 900 మంది వరకు ఉన్నారు. సిబ్బందికి కరోనా సోకడంతో అప్రమత్తమైన అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

Latest Updates