ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా డేంజర్ బెల్

సంగారెడ్డిలో అత్యధికంగా 1,750 కేసులు

సిద్దిపేటలో 524, మెదక్ లో 250 కేసులు

పట్టణాల నుంచి పల్లెలకు విస్తరిస్తున్న వైరస్

సంగారెడ్డి/ మెదక్/ సిద్దిపేట, వెలుగుఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 2,524కు చేరాయి. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 1,750 కేసులు, మెదక్ జిల్లా ల్లో 250, సిద్దిపేట జిల్లాలో 524 మంది వైరస్ బారిన పడ్డారు. మొన్నటి వరకు పట్టణాలకే పరిమితమైన కరోనా ఇప్పుడు పల్లెలకు కూడా పాకింది. పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు ఉన్న టైంలో నియంత్రణ చర్యలపై దృష్టి పెట్టిన మూడు జిల్లాల యంత్రాంగాలు… తీరా కరోనా విజృంభిస్తున్న క్రమంలో… పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నా యి. అధికారుల అలసత్వం , ప్రభుత్వ దవాఖాన్లలో నిర్లక్ష్యం, ప్రైవేటు హాస్పటల్‌‌ బిల్లుల బాదుడు ఇలాంటి కారణాలు అనేక అనర్థాలకు దారితీస్తున్నయి. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 62 మంది వైరస్‌‌తో చనిపోయారు. వైరస్ సోకిందన్న విషయం తెలియగానే కుటుంబ సభ్యుల్లో చెట్టుకొ కరు పుట్టకొకరుగా వేరుపడి ట్రీట్మెంట్ కోసం వెంపర్లా డుతున్నా రు. రాపిడ్ యాంటీ టెస్టులు జిల్లా కేంద్రాల్లో తప్ప మిగతా అర్బన్ హెల్త్ సెంటర్లు, పీహెచ్‌ సీల్లో అనుకున్న స్థాయిలో జరగడం లేదని అక్కడక్కడ గొడవలు జరుగుతున్నాయి.

సంగారెడ్డి జిల్లా కేంద్ర హాస్పిటల్లో స్టాఫ్ టెస్ట్ టోకెన్లు అమ్ముకున్నా రు. రోజు వారీగా దాదాపు 250 మంది కరోనా లక్షణాలతో హాస్పిటల్‌కు వస్తుండగా 90 మందికి మాత్రమే టెస్టులు చేస్తుండడంతో చాలా మంది నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోతున్నా రు. హోం ఐసోలేషన్ కిట్ల విషయానికి వస్తే సరిగ్గా అందుత లేవు. ఒకవేళ ఎవరికైనా అందిన అందులో అన్ని మందులు ఉండడం లేదు. అడుగడుగునా నిర్లక్ష్యం ఉండడంతో ఉమ్మడి జిల్లాలో వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది.

అంతా పాకింది

ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల్లో కరోనా వ్యాప్తి చెందింది. మొన్నటి వరకు పట్టణాల్లో ప్రభావితం చేసిన వైరస్ ఇప్పుడు పల్లెలను తాకింది. ఫ్రంట్ వారియర్సులలో ఒకరైన పోలీసులను కరోనా కబలిస్తోంది. ఇప్పటికీ నలుగురు పోలీసులను కబళించింది. సీఐలు, ఎస్ఐలను కరోనా భయపెట్టిస్తోంది. ప్రభుత్వ ఆఫీసుల్లో వైరస్ విలయతాండవం చేస్తోంది. ఆఫీసులు, బ్యాంకులకు తాళాలు పడుతున్నాయి. కోవిడ్ ఉమ్మడి జిల్లా  యవత్రాంగాలు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ కలవరపెడుతోంది. ఇలాంటి సమయంలో ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడం మినహా ప్రత్యామ్నా య మార్గాలు కనిపించడం లేదు.

జిల్లాల వారీగా

సంగారెడ్డి జిల్లాలో వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. రోజుకు వందల సంఖ్యలో పాజిటివ కేసులు నిర్ధారణ కావడం అంతు పట్టడం లేదు. సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్ చెరు, సదాశివపేట, జోగిపేట, అమీన్ పూర్, రామచంద్రపుర ప్రాంతాల్లో వైరస్ ఎక్కువగా ప్రభావితమవుతోంది. జోగిపేట ఎస్ఐ-2 ప్రభాకర్, ఇంటెలిజెన్సు విభాగంలో ఏఎస్ఐ వెంకటేశం వైరస్ తో చనిపోయారు.

ఇదిలా ఉంటే నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్ లోని కల్హేర్ మండలం ఖానాపూర్ తండా లో ముగ్గురు కరోనా పేషెంట్లను శ్మశాన వాటికలో ఉంచి ట్రీట్మెంట్ ఇప్పించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. మెదక్ జిల్లా లో జూలై 31వ తేదీ వరకు మొత్తం 250 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 90 మంది రికవరీ కాగా, 132 మంది హోం ఐసోలేషన్‌‌లో ఉన్నారు. 18 మంది హాస్పటల్‌‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా రు. ఇప్పటి వరకు జిల్లాలో కరోనా సోకి 10 మంది చనిపోయారు. మెదక్ పట్టణానికి చెందిన వస్త్ర వ్యాపారులు అయిన అన్నదమ్ములు కరోనాతో ఇక రోజు వ్యవధిలోనే మృతి చెందారు. అంతకు ముందు రామాయంపేటలో వారి చెల్లెలు కూడా కరోనాతో చనిపోయింది. దాదాపు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కరోనా వ్యాప్తి చెందింది. సిద్దిపేట జిల్లా లో మొత్తం కరోనా పాజిటివ్‌‌ కేసులు సంఖ్య 523కు చేరింది. వీరిలో 296 మంది రికవరీ కాగా హోం ఐసోలేషన్‌‌లో 160 మంది ఉన్నారు. 67 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా ఇప్పటి వరకు జిల్లా లో 10 మంది చనిపోయారు. దుబ్బాక పట్టణంలో మూడు రోజుల వ్యవధిలో తల్లీ కొడులు కోవిడ్‌‌ బారిన పడి మృతి చెందగా, అదే కుటుంబంలోని మరో ముగ్గురికి వైరస్‌‌ సోకింది.

అయితే సిద్దిపేటలో రాపిడ్‌‌ టెస్టు ల విషయంలో గందరగోళం నెలకొంది. పరీక్షల కోసం కోవిడ్ ఆసుపత్రికి వెళ్లిన వారిని అర్బన్‌‌ హెల్త్ సెంటర్లకు పంపుతున్నారు. అర్బన్‌‌ హెల్త్ సెంటర్‌‌‌‌లో మాత్రం ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారికి మాత్రమే పరీక్షలు చేస్తున్నా రు. జిల్లా ఆసుపత్రి నుంచి టెస్టు ల కోసం వచ్చిన వారిని వెనక్కి పంపుతున్నారు. శనివారం వివిధ మండలాల నుంచి వచ్చిన నలుగురు జిల్లా ఆసుపత్రికి, అర్బన్‌‌ హెల్త్ సెంటర్ల చుట్టూ తిరిగారు.

Latest Updates